కారు ఆపిన దుండగులు....డాక్టర్ పై యాసిడ్ దాడి చేశారు
విశాఖ నగరంలో ఒక వైద్యుడిపై ఇద్దరు యువకులు యాసిడ్‌తో దాడి చేశారు. బాలాజీ భూషణ పట్నాయక్ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు.
విశాఖపట్నం: విశాఖ నగరంలో ఒక వైద్యుడిపై ఇద్దరు యువకులు యాసిడ్‌తో దాడి చేశారు. బాలాజీ భూషణ పట్నాయక్ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన విధులు ముగించుకుని కారులో పందిమెట్టలో వున్న తన ఇంటికి వెళుతుండగా నౌరోజీ రోడ్డు సమీపంలో యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి అటకాయించారు. దీంతో ఎవరనే విషయం తెలుసుకోవడానికి డాక్టర్ పట్నాయక్ కారు అద్దాలు కిందికి దించారు.

ఆ సమయంలో ఇద్దరు యువకులు అతనిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ ఘటన లో డాక్టర్ పట్నాయక్ మొహం పూర్తిగా కాలిపోయింది. దాడికి పాలపడిన దుండగులు ఎవరు ఎందుకు ఈ దాడికి దిగారు అన్న విషయం మిస్టరీగా ఉంది. ఇది ఇలా ఉంటె డాక్టర్ పట్నాయక్ ని ఆసుపత్రికి పంపించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications