తప్పతాగి రెస్టారెంట్లో యువనటుడి వీరంగం.. దాడి, అరెస్ట్: డ్రగ్స్‌కు బానిసయ్యాడు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని బార్‌లో తప్పతాగి చిందులు వేయడమే కాకుండా సిబ్బంది పైన దాడికి పాల్పడిన ఓ నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సినిమా నటుడిగా తెలుస్తోంది. అతని పేరు ఉదయ్.
అతను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని జిఆర్టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోమవారం రాత్రి తప్పతాగి గందరగోళం సృష్టించినట్లు సీఐ తెలిపారు. అడ్డుకునేందుకు యత్నించిన బార్ సిబ్బందిని కొట్టడమే కాకుండా చంపుతానని బెదిరించాడన్నారు.
రెస్టారెంటు అద్దాలు పగులగొట్టి కుర్చీలు విసిరేసాడని బార్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. సినీ హీరోగా చెబుతూ అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ అనేక మందిని ఉదయ్ మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో డబ్బు కాజేసినట్లు పలు స్టేషన్లలో ఫిర్యాదులున్నట్లు చెప్పారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని పలు స్టేషన్లలో సుమారు ఇరవై కేసుల్లో నిందితుడని సీఐ వెల్లడించారు. ఉదయ్ నటనపై ఆసక్తితో కాకినాడ నుంచి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు.
ఫిలింనగర్‌లోని నటుల దృష్టిలో పడ్డాడు. టీవీ సీరియళ్లు, సినిమాల్లో అవకాశాలు పొందాడు. నటుడిగా పేరు తెచ్చుకున్న సమయంలో.. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. నైజీరియన్లతో కలిసి వ్యాపారం నిర్వహించేంత వరకూ మారిపోయాడని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications