వీడియో: కాలినడకన తిరుమలకు దీపికా పదుకొనె
Deepika Padukone: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 60,928 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 22,358 మంది తలనీలాలను సమర్పించారు. అయిదు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు.
సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి ఎనిమిది నుంచి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సమీపిస్తోండటంతో తిరుమలలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రోజూ లక్షమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శిస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రముఖ నటి దీపికా పదుకొనె తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన ఆమె తిరుమలకు వచ్చారు. తన చెల్లెలు, ప్రొఫెషనల్ గోల్ఫర్ అనీష పదుకొనెతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి ఆమె ఇక్కడికి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. గురువారం తెల్లవారు జామున శ్రీవారి సేవలో పాల్గొంటారు దీపికా పదుకొనె.
#WATCH | Andhra Pradesh | Actor Deepika Padukone arrived at Tirumala this evening, to offer prayers to Lord Venkateswara. Her sister and professional golfer Anisha Padukone was also with her. pic.twitter.com/o1x6g9dLG5
— ANI (@ANI) December 14, 2023
దీపిక పదుకొనె ఈ ఏడాది నటించిన రెండు సినిమాలు పఠాన్, జవాన్.. సూపర్ హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించాయి ఈ రెండు మూవీలు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫైటర్. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటోంది.
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఏడీ సెట్స్‌పై ఉంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై సీ అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. మరో సినిమా సింగం ఎగైన్ షూటింగ్ జరుపుకొంటోంది.












Click it and Unblock the Notifications