భూమా అఖిలకు చంద్రబాబు షాక్- ఆళ్లగడ్డ బరిలో మంచు మనోజ్..?!

హైదరాబాద్/అమరావతి: ఊహించిందే జరుగుతోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్.. రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంచు మనోజ్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలుసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నిజానికి- మంచు మనోజ్ కుటుంబం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణు.. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులు. వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు ఉన్నాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ జగన్ పార్టీ తరఫున వారిద్దరూ విస్తృతంగా ప్రచారం చేశారు.

Actor Manchu Manoj likely to join in TDP

చంద్రబాబు సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి తమవంతు కృషి చేశారు. సినిమా పరిశ్రమలో పలువురు నటులు, టెక్నీషియన్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న భూమా మౌనికా రెడ్డి కుటుంబం- తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది. భూమా అఖిలప్రియ.. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వైఎస్ఆర్సీపీ చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తరువాత కూడా ఆమె క్రియాశీలకంగా ఉంటోన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తోన్నారు.

అఖిలప్రియ చెల్లెలు మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న మంచు మనోజ్.. టీడీపీ వైపు మొగ్గు చూపినట్టే. ఈ సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో చంద్రబాబును కలుసుకోనున్నారని, దీనికి అపాయింట్‌మెంట్ కూడా లభించిందని చెబుతున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకొంటారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

అదే జరిగితే- మంచు మనోజ్‌ను ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే భూమా అఖిలపై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తమౌతోండటం, ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో ఆమె ఒంటెత్తు పోకడలు పోతోన్నారంటూ ఫిర్యాదులు అందటం వల్ల ఆమెకు టికెట్ దక్కకపోవచ్చని సమాచారం.

టీడీపీకే చెందిన సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు తీవ్ర స్థాయిలో విభేదాలు ఉంటోన్న విషయం తెలిసిందే. ఇది కూడా భూమా అఖిలప్రియను పక్కన పెట్టడానికి ఓ కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు బదులుగా మంచు మనోజ్‌ను పోటీకి దింపొచ్చనే అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+