పవిత్రా లోకేష్ తో పిల్లల్ని కనడంలో తప్పేమీ లేదు: నరేష్

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. అయితే తాము ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను స్వయంగా నిర్మించారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ వీరిద్దరి రిలేషన్ షిప్ మాత్రం అందరికీ తెలిసింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ జంట చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్ గామారాయి.

సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాలు బయటకు తెలియకుండా జాగ్రత్తపడతారు. కానీ నరేష్, పవిత్రా లోకేష్ మాత్రం అన్నీ బహిరంగంగానే చెప్పేవారు. అలాగే పిల్లల్ని కనే విషయమై మాట్లాడారు. పవిత్రా లోకేష్ తో కలిసి పిల్లలను కనడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉన్నామని, మెడికల్ గా పిల్లల్ని కనొచ్చని, అయితే తాము పిల్లల్ని కన్న తర్వాత తనకు 80 సంవత్సరాల వయసు వస్తే పుట్టే బిడ్డకు 20 సంవత్సరాలు వస్తాయని, అది అవసరమా? అని ప్రశ్నించారు.

 naresh

భార్యాభర్తలుగా కలిసే ఉంటామని, నా పిల్లలు, పవిత్ర పిల్లలు.. ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటామన్నారు. తమకు ఇప్పటికి 5 పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నామన్నారు. బ్లడ్ రిలేషన్ షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ గొప్పదని, కృష్ణగారిని చూసినప్పుడు తనకు అమ్మే కనపడేదన్నారు. ఆయన మృతిచెందాక కుప్పకూలిపోయానని, మానసికంగా కుంగిపోయానన్నారు. పవిత్రలో విజయ నిర్మల కనపడతారని, తన తల్లి కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయన్నారు. తమ ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+