హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్: నేడో, రేపో నోటీసులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంతమేరకు ఆక్రమిత భూముల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఎన్ కన్వెన్షన్‌లో తమ్మిడికుంట చెరువులోని 3.12 ఎకరాలు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే ఎన్ కన్వెన్షన్ సెంటర్ పేరుతో ఇక్కడ నిర్మించిన నిర్మాణాలకు కూడా మహానగర పాలక సంస్థ అనుమతి లేదట!

తమ్మిడికుంట చెరువును శుక్రవారం, శనివారం సర్వే చేసిన అధికారులు ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలో ఉన్న చెరువు భూమిని మార్ఫింగ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై నోటీసులు ఇచ్చి ఆక్రమణ, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని హైదరాబాదు మహా నగర పాలక సంస్థ అధికారులు నిర్ణయించారు.

Actor’s convention centre under GHMC scanner

ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిధిలో 6.69 ఎకరాలు ఉండగా... అందులో 3.12 ఎకరాలు అక్రమమని నివేదికలో అధికారులు పొందుపర్చారు. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌ో ఉన్నట్లు మరో రెండు ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి చెరువుకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించిన తర్వాత భవిష్యత్తులో అధిక వర్షాలు కురిస్తే నీటి పారుదలను దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల ఉండే కొంత భూమిని బఫర్ జోన్ కింద చూపిస్తుంటారు. దీన్ని కూడా చెరువు పరిధిలోనిదిగానే పరిగణిస్తారు.

English summary
After demolishing 24 unauthorized buildings in Ayyappa Society on the land that belongs to the Gurukul Ghatkesar Trust, the GHMC, revenue and irrigation departments have decided to take up a joint survey of Tammidi Kunta (Cheruvu) adjacent to Gurukul land in Madhapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X