టిడిపిలోకి యాక్టర్ సాయి కుమార్, కారెం శివాజీ?

 Actor Sai Kumar may join in TDP
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోకి సినీ ప్రముఖులు జోరుగా వచ్చి చేరుతున్నారు. తాజాగా, ప్రముఖ నటుడు సాయి కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ప్రవేశించారు. మొదట్లో ఆయన ప్రముఖ హీరో రాజశేఖర్‌కు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో నటిస్తూ వచ్చారు. పోలీసు పాత్రకు ఆయన పెట్టింది పేరుగా మారారు.

ఆయన తెలుగు, కన్నడ, తమిళం సినిమాల్లో నటించారు. సామాన్యుడు సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఎకె 47 వంటి సినిమాల్లో నటించారు. ఆయన డైలాగ్ డెలివరీ శివాజీ గణేషన్, జగ్గయ్య కంఠస్వరాలను తలపిస్తుంది.

ఇదిలావుంటే, మాల మహానాడు నేత కారెం శివాజీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి మాలలు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కారెం శివాజీ తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి రాజీనామా చేసిన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం కాంగ్రెసు పార్టీలో చేరుతారని సమాచారం. మహబూబ్‌నగర్ టికెట్‌ను తెలంగాణ జెఎసి నేత శ్రీనివాస గౌడ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆయన తెరాసకు రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+