వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, వీర్రాజులపై వ్యాఖ్యలు: హీరో శీవాజీకి చేదు అనుభవం

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తెలుగు సినీ హీరో శివాజీకి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ నేత సోము వీర్రాజుపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శివాజీ బస చేసిన హోటల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, వీర్రాజుపై శివాజీ వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఆదివారం రాజమండ్రిలో శివాజీ బస చేసిన షెల్టాన్‌ హోటల్‌ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

Shivaji

శివాజీ బీజేపీపై అనవసరమైన, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, మోడీతోపాటు వీర్రాజుపై కూడా వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారని వారు ఆరోపిస్తూ శివాజీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మీడియా సమావేశాన్ని అడ్డుకుంటామని, హోటల్‌ నుంచి బయటకు రానివ్వమని బీజేపీ కార్యకర్తలు హెచ్చరించారు.

శివాజీ బీజేపీ నేతగా చెప్పుకుంటున్నారని, ఆయన అసలు బీజేపీ కార్యకర్త కాదని నిరసనకారులు అన్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

English summary
Telugu hero Shivaji has faced bad experience at Rajamundry in East Godavari district of Andhra Pradesh for criticising Narendra Modi and Veerraju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X