ఓ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్, పావుగా కొత్త నాయకుడు, రూ.4800 కోట్లు ఖర్చు: శివాజీ సంచలనం

అమరావతి: ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ప్రముఖ నటుడు శివాజీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ చేపట్టిందని వ్యాఖ్యానించారు. ఆయన ఆ జాతీయ పార్టీ పేరు మాత్రం చెప్పలేదు.

అందరూ అనుకున్నట్లు ఆపరేషన్ గరుడ కాదని, అందులో గరుడ ఓ భాగం మాత్రమేనని, ఆపరేషన్ ద్రవిడ అని, అంటే ద్రవిడ దేశం.. అంటే సౌత్ ఇండియా అని, అదే అసలు ఆపరేషన్ అని శివాజీ చెప్పారు. దాంట్లో ఉప భాగాలే ఆపరేషన్ గరుడ అన్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఆ జాతీయ పార్టీ పెట్టుకున్న పేరు అది అన్నారు.

 దక్షిణాదిన ఆపరేషన్, నాకు అప్పుడే తెలిశాయి

దక్షిణాదిన ఆపరేషన్, నాకు అప్పుడే తెలిశాయి

కర్నాటకలో ఆపరేషన్ కుమార అని చేపట్టారని, తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ చేపట్టారని శివాజీ అన్నారు. ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. అన్ని వివరాలు క్రోఢీకరించి 2019 టార్గెట్‌ను ఎలా చేరుకోవాలో వివరించారని, అజ్ఞాత వ్యక్తి ద్వారా 2017 సెప్టెంబర్‌లోనే తనకు ఈ విషయాలు తెలిశాయన్నారు.

 ఈ ఆపరేషన్ కోసం భారీ ఖర్చు

ఈ ఆపరేషన్ కోసం భారీ ఖర్చు

ఈ ఆపరేషన్ ఖర్చు మొత్తం రూ.4800 కోట్లు అని, ఇందులో కొంత తరలించారని తెలిసిందని శివాజీ చెప్పారు. ఆపరేషన్ పరిస్థితులకు అనుగుణంగా మారవచ్చునని, విధివిధానాలు మారవచ్చునని చెప్పారు. ఈ ఆపరేషన్‌కు సంధానకర్తగా ప్రముఖ వ్యక్తి ఉన్నారని, ఈ ఆపరేషన్‌లోకి రావడమే తప్ప బయటకు వెళ్లడం ఉండదన్నారు. వ్యక్తిగతంగా తాను వివరాలు ప్రజల ముందు ఉంచుతున్నానని చెప్పారు.

 పెన్‌డ్రైవ్‌లో ఉంది, అందరికీ ఇస్తా

పెన్‌డ్రైవ్‌లో ఉంది, అందరికీ ఇస్తా

గత ఏడాది తనకు ఈ విషయం తెలిసిందని, ఓ జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ సంస్థకు చెందిన వ్యక్తి ద్వారా ఈ విషయం తెలిసిందని శివాజీ అన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలన్నింటిని ఓ పెన్ డ్రైవ్‌లో పొందుపర్చానని, వాటిని త్వరలోనే అందరికీ ఇస్తానని చెప్పారు.

 ఓ కొత్త నాయకుడిని పావుగా వాడుకుంటోంది

ఓ కొత్త నాయకుడిని పావుగా వాడుకుంటోంది

తాను ఇచ్చే పెన్ డ్రైవ్‌లో పూర్తి వివరణ ఉంటుందని శివాజీ చెప్పారు. ఓ కొత్త నాయకుడిని ఆ జాతీయ పార్టీ పావులా వాడుకుంటోందని శివాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో తాను చెబుతానని బాంబు పేల్చారు.

 ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను

ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను

ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని శివాజీ అన్నారు. తాను ఇచ్చే పెన్ డ్రైవ్‌లో ఇచ్చే విషయాలు పూర్తిగా తెలుసుకొని, ఆ తర్వాత తనను ప్రశ్నించాలని తెలిపారు. కాగా, అతను ఆ జాతీయ పార్టీ పేరు చెప్పకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+