పవన్ కల్యాణ్ ను రిక్వెస్ట్ చేసిన శ్రీరెడ్డి

'నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా' అని నటి శ్రీరెడ్డి తన ట్విటర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విన్నవించుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహిపై ట్వీట్ చేసింది.

actor srireddy

వారు వీరు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినీ పరిశ్రమకు చెందిన అందరిపై నోరు పారేసుకుంటూ శ్రీరెడ్డి పాపులరైంది. ఎప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుతుందో అర్థం కానటువంటి రీతిలో వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి ట్వీట్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ట్వీట్ శ్రీరెడ్డి ఖాతానుంచే వచ్చిందా? లేదంటే ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

actor srireddy

దేశ‌వ్యాప్తంగా టీటైమ్ ఔట్‌లెట్స్ తో పేరు తెచ్చుకున్న యువ పారిశ్రామిక‌వేత్త ఉద‌య్‌ ఈ చైతన్యరథం పనులను పర్యవేక్షించారు. సినిమా కథానాయకులకు ఉండే క్యారీవ్యాన్ లా కాకుండా పూర్తిగా రాజకీయాల కోసం ఉపయోగించేలా వారాహిని సిద్ధం చేశారు. ఆరుగురు వ్యక్తులు కూర్చొని చర్చించుకునేలా వాహనం లోపల సిట్టింగ్ రూమ్, 360 డిగ్రీల కోణంలో వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనానికి రెండువైపులా బాడీగార్డులు నిలబడటానికి, జీపీఎస్ ట్రాకింగ్, వాహనం లోపలి నుంచి పవన్ పైకి వచ్చేలా పవర్ లిఫ్ట్ సిస్టం సిద్ధమైంది. ప్రజలతో మాట్లాడే సమయంలో చిన్న డయాస్ లా డిజైన్ చేయడంతోపాటు సౌండ్ సిస్టం, లైటింగ్ ఉన్నాయి. వారాహి ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలను త్వరత్వరగా పూర్తిచేసి చివరి 6 నెలలకు రాజకీయాలకే పరిమితవ్వాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+