కెసిఆర్‌పై నటుడు సుమన్ ప్రశంసలు: కెసిఆర్ పిలిస్తే..

నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ప్రముఖ నటుడు సుమన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. కెసిఆర్ పాలనాదక్షత అద్వితీయమని, కెసిఆర్ పాలనలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

శుక్రవారం నల్గొండడ జిల్లాలోని భువనగిరి రహదారిబంగ్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణను బాగుచేద్దామనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉంటే, విపక్షాలు ప్రతి విషయంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. రాత్రికిరాత్రే అభివృద్ధి జరగాలంటే సాధ్యం కాదని, చిన్నచిన్న తప్పులు జరగడం సహజమేనన్నారు.

ప్రజల కష్టానష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ అని, 60 ఏండ్ల సీమాంధ్రుల పాలనకు వ్యతిరేకంగా నిలిచి పోరాడి రాష్ర్టాన్ని సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. జనరంజక పాలన కేసీఆర్‌తోనే సాధ్యపడుతుందని, ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

Actor Suman praises CM KCR

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆసరా పథకంలో అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, ఇక్కడ చేపట్టబోయే సంక్షేమ పథకాలకు ఇతర దేశాల ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు సీఎం కేసీఆర్ ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధమన్నారు.

ఇటీవల కూడా సుమన్ సిఎం కెసిఆర్‌పై పలుమార్లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలన బాగుందని సుమన్ అన్నారు. రైతు సమస్యలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని ఆయన అన్నారు. నాలుగు నెలల్లోనే సమస్యలను పరిష్కరించడం ఏ ప్రభుత్వంతోనూ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే తెలంగాణలో ఏటేటా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులకు సీఎం కేసీఆర్‌ సాయం అందించాలని అన్నారు. రైతు ఆత్మహత్యలకు వ్యవసాయ నష్టంతో పాటు ఇతర కారణాలు కూడా తోడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను ప్రతి ఏటా కరువు ఎదురయ్యే పరిస్థితుల్లో ఆదుకునేందుకు ప్రత్యేక కార్డులు జారీ చేస్తే బాగుంటుందన్నారు.

ఆ కార్డులు కలిగిన అసలైన రైతులకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే మూడు నెలల కాలంలో నిత్యావసరాలు కల్పించడంతో పాటు ఆర్థిక సాయం చేస్తే రైతుల ఆత్మహత్యలు కొంత మేరకు నివారించవచ్చన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి తాను ప్రత్యేక తెలంగాణకు జై కొడుతూ వచ్చానని సుమన్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+