స్టార్స్ క్యూ: బిజెపిలో చేరిన నటుడు సురేష్

తామేదో ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నట్లు ప్రచారం సాగిస్తున్నారని, అది నిజం కాదని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయాలని ముందుకు వచ్చినప్పుడు రాళ్లు పడడం మామూలేనని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
సురేష్ చెన్నైలో పెరిగారు. ఆయన పన్నీర్ పుష్పంగల్ తమిళ సినిమా ద్వారా 1981లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన దాదాపు 274 సినిమాల్లో నటించారు. పుట్టింటి పట్టు చీర, ప్రార్థన, సూరిగాడు, అల్లరి పిల్ల వంటి తెలుగు సినిమాల్లో ఆయన నటించారు.
అమ్మోరు, పట్టుకోండి చూద్దాం, దొంగాట, భవాని వంటి తెలుగు సినిమాల్లో కూడా సురేష్ నటించారు. తమిళ సినిమాల్లో చాలా ఎక్కువగా ఆయన నటించారు.












Click it and Unblock the Notifications