బాలయ్య దొరికేసాడు..ట్రోలింగ్-దుమారం : భారతరత్న నాన్న చెప్పుతో సమానం-రెహ్మాన్ తెలియదు..!!

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అదే నెటిజెన్లను అస్త్రంగా మారింది. సోషల్ మీడియలో ట్రోలింగ్ చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత పురస్కారం భారత రత్న పైన బాలయ్య చేసిన వ్యాఖ్యలపైన నెటిజెన్లు మండిపడుతున్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆదిత్య 369 సినిమాకు 30 ఏళ్లు పూర్తి కావటంతో బాలయ్య ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన అవార్డుల గురించి ఈ కామెంట్లు చేసారు.

భారత రత్న ఎన్టీఆర్ కాలి చెప్పుతో సమానం..

భారత రత్న ఎన్టీఆర్ కాలి చెప్పుతో సమానం..

భారత రత్న తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు..కాలి చెప్పుతో సమానం అంటూ వ్యాఖ్యానించారు. అది తీసుకున్న వారికి కాదని..ఇచ్చిన వారికి గౌరవమంటూ కామెంట్ చేసారు. ఎన్టీఆర్ కు గౌరవం ఏంటని ప్రశ్నించారు. తెలుగు సినీ పరిశ్రమకు తన కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదన్నారు. భారతరత్న కంటే ఎన్టీఆర్ గొప్పోడు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

రెహమాన్ ఎవరో తెలియదు..

రెహమాన్ ఎవరో తెలియదు..

ఏఆర్‌ రెహమాన్‌కు ఆస్కార్‌ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలకృష్ణ ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్‌ అందిస్తాడు, ఆస్కార్ అవార్డు అంటారు, అవన్నీ నేను పట్టించుకోను అని పేర్కొన్నారు. సంగీత దిగ్గజం మేస్ట్రో ఇళయరాజాతో ప్రస్తావన వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్‌పై బాలయ్య ఈ రకంగా కామెంట్ చేసారు. హాలీవుడ్‌ చిత్రనిర్మాత జేమ్స్‌ కామెరూన్‌తో పోల్చుకుంటూ బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేమ్స్‌ కామెరూన్‌లాగా కాకుండా తను సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తానని వెల్లడించారు.

 సోషల్ మీడియాలో ట్రోలింగ్..

సోషల్ మీడియాలో ట్రోలింగ్..

జేమ్స్ కామెరాన్ ఒక్క సినిమాను పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పట్టిందని బాలయ్య అన్నారు. అలాగే ఒకేసారి మూడు సినిమాల్లో నటించగలిగే సత్తా ఉందని అన్నారు. కాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. దేశంలోనే అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని ఇలా కించపరచడం దారుణమని బాలయ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే సమయంలో రెహమాన్ చేసిన కామెంట్ల పైనా స్పందిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్ ఎవరో తెలియకుండానే నీ నిప్పురవ్వ సినిమాకి పనిచేయించుకున్నావా అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు.

దీంతో...ఇప్పుడు బాలయ్య కామెంట్లు..ఇటు నెటిజెన్ల కామెంట్లు సోషల్ మీడియా లో మోత పుట్టిస్తున్నాయి. మరి..బాలయ్య తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటారా..లేక వివరణ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+