లక్కీ ఛాన్స్ కొట్టిన నాగబాబు

Modi's swearing-in ceremony: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడోసారి ప్రధానిగా ఈ సాయంత్రం 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మోదీని ఎన్నికైన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో ఆయన ఎన్నికయ్యారు. రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి ఆయన పేరును ప్రతిపాదించగా.. మిగిలిన వారు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Actor turned politician Nagababu attend the oath ceremony of PM-designate Modi

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ.

తనకు మద్దతు ఇచ్చే సభ్యుల సంతకాలతో కూడిన లేఖను మోదీ.. రాష్ట్రపతికి అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఈ సాయంత్రం 7:15 నిమిషాలకు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేస్తారు. మోదీ ప్రమాణ స్వీకార నేపథ్యంలో- ఢిల్లీలో కనివినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు.

ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారోత్సవం ఆరంభం కాబోతోండటంతో ఆహ్వానితులు రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకుంటోన్నారు. ఫోర్ట్ కోర్ట్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, సెలెబ్రిటీలు రాష్ట్రపతి భవన్‌కు వస్తోన్నారు.

ఈ క్రమంలో- జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, టాలీవుడ్ నటుడు నాగబాబు సైతం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఎన్డీఏలో భాగస్వామ్యపక్షానికి చెందిన నాయకుడు కావడం వల్ల ఆ హోదాలో ఆయన ఇందులో పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, గాయకుడు కైలాష్ ఖేర్.. హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+