జయలలిత అపరఝాన్సీ: ఆస్సత్రికి నటి శారద, ప్రశంసలు
చెన్నై: నిన్నటి తరం టాలీవుడ్ కథానాయిక, ప్రముఖ నటి శారద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అపర ఝాన్సీగా ఆమె అభివర్ణించారు.
గత కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు గురువారం శారద ఆస్పత్రికి వచ్చారు.

వైద్యులను అడిగి జయ ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శారద మీడియాతో మాట్లాడారు. జయలలిత అపర ఝాన్సీ అని, అనారోగ్యాన్ని జయించి ఆస్పత్రి నుంచి త్వరలోనే ఆమె బయటపడతారని పేర్కొన్నారు.
అంతేగాక, జయలలితకు ఝాన్సీరాణి అంతటి ధైర్య సాహసాలు ఉన్నాయని కొనియాడారు. కాగా, జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే ఆమె అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications