రిమాండ్‌కు తరలింపు: నటి తారా చౌదరి చేసిన అల్లరి ఏంటీ, నమోదైన కేసులివే...!
విజయవాడ: సొంత వదిన కవితపై దాడి చేసిన ఘటనలో శుక్రవారం సాయంత్రం బెజవాడ పోలీసులు సినీ నటి తారా చౌదరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను శనివారం ఉదయం విజయవాడలోని మొదటి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు.
కేసును విచారించిన కోర్టు తారా చౌదరికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో, ఆమెను విజయవాడలోని సబ్ జైలుకు పోలీసులు తరలించారు. వదినపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆమెపై ఐపీసీ 332, 352, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లో ఉంటున్న తారా చౌదరి శుక్రవారం తన సొంతూరు గుంటూరు జిల్లాలోని వినుకొండకు వెళ్లింది. తారా చౌదరి అన్న రావెళ్ల శ్రీనివాస్, ఆయన భార్య కవిత పాయకాపురంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన తారా చౌదరి తన ఆడపడుచుతో ఘర్షణకు దిగింది.

తన అన్నను తమ వద్దకే పంపించాలని గొడవ పెట్టుకుంది. స్థానికులు ఫిర్యాదుతో ఏఎస్ఐ రామారావు, మాహిళా కానిస్టేబుల్ జ్యోతి అక్కడకు వచ్చారు. గొడవ పడవద్దని నచ్చజేప్పేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ జ్యోతిపై తారా చౌదరి దాడికి పాల్పడి, ఆమెను గోళ్లతో రక్కింది. ఈ దాడిలో మహిళా కానిస్టేబుల్ చేతికి గాయాలయ్యాయి.
దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమను బలవంతంగా వినుకొండ తీసుకేళ్లేందుకు తారా చౌదరి ప్రయత్నిస్తోందని, కూలి పని చేసుకుని బతుకుతున్న తమను బెదిరిస్తోందని తారా చౌదరి వదిన కవిత ఆరోపించింది. గతంలో తారా చౌదరి గతంలో వ్యభిచారం కేసులోను అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications