Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలకృష్ణ నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. వేధించాడు: బాంబు పేల్చిన హీరోయిన్

చెన్నై: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కోలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ హీరోయిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి.

Recommended Video

    Vichitra Comments చేసింది Balakrishna పై కాదు.. వాస్తవం తెలియాలంటే | Telugu Oneindia

    ఆ హీరోయిన్ పేరు విచిత్ర (Vichitra). గతంలో నందమూరి బాలకృష్ణ సరసన భలేవాడివి బాసూ (Bhalevadivi Basu) సినిమాలో నటించారు. ఇందులో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. గిరిజన యువతి పాత్రలో కనిపించారు. బాలకృష్ణ, శిల్పాషెట్టి, అంజల ఝవేరీ కాంబినేషన్‌లో 2001లో విడుదలైందీ మూవీ. పీఏ అరుణ్ ప్రసాద్ దర్శకుడు. బాలయ్య కేరీర్‌లో ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఇది.

    Actress Vichithra made casting couch allegations on hero nandamuri balakrishna

    ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను కాస్టింగ్ కౌచ్ (Casting couch) వేధింపులను ఎదుర్కొన్నానని విచిత్ర తెలిపారు. తాజాగా అమె తమిళ బిగ్ బాస్ సీజన్ 7కు గెస్ట్‌గా హాజరయ్యారు. సినిమాల్లో నటించేటప్పుడు తనకు ఎదురైన అనుభవాలను బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పంచుకున్నారు.

    ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కావడం వల్ల ఎక్కువ భాగం సినిమా షూటింగ్ కేరళ అడవుల్లో సాగింది. మళంపుజ అడవుల్లో సినిమాను తీశారు. భలేవాడివి బాసూ సినిమా షూటింగ్‌లో తాను చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని, ఆ తరువాత సినిమాలంటేనే అసహ్యం వేసిందని వ్యాఖ్యానించారు. పెళ్లి తరువాత తాను సినిమాల్లో నటించకపోవడానికి కాస్టింగ్ కౌచ్ ఓ ప్రధాన కారణమని విచిత్ర తెలిపారు.

    మళంపుజ అడవుల్లో సినిమా షూట్ చేస్తోన్నప్పుడు తమకు చిత్రం యూనిట్ 3- స్టార్ హోటల్‌లో బస కల్పించిందని, తన భర్తతో మొదటిసారిగా అప్పుడే పరిచయమైందని అన్నారు. ఆ హోటల్ జనరల్ మేనేజర్‌గా పని చేసేవారని విచిత్ర గుర్తు చేశారు. సినిమా యూనిట్ కావడం వల్ల తమకు హోటల్ మేనేజ్‌మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

    ఆ పార్టీ ముగిసిన తరువాత సినిమా హీరో తనను రూమ్‌కు రావాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చాడని విచిత్ర పేర్కొన్నారు. అంత పెద్ద స్టార్ హీరో నోటి నుంచి ఇలాంటి మాట వినాల్సి వస్తుందని తాను ఏ మాత్రం ఊహించలేదని, హోటల్ రూమ్‌కు వెళ్లడానికి నిరాకరించానని ఆమె వివరించారు.

    ఆ మరుసటి రోజు నుంచే తాను అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నానని విచిత్ర చెప్పారు. ఆ తరువాత సినిమాలంటే తనకు ఆసక్తి తగ్గిపోయిందని, పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నానని అన్నారు. ఆ హీరో నందమూరి బాలకృష్ణే అంటూ ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+