Balakrishna: కొత్త కొత్తగా బాలకృష్ణ: గుండుతో ట్రెండీ లుక్: అసెంబ్లీలో సెంటర్ అట్రాక్షన్‌గా.. !
అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సరికొత్త అవతారం.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. ఇదివరకు ఎప్పుడూ ఈ లుక్‌లో కనిపించలేదాయన. గుండు గీయించుకుని, బుర్ర మీసాలతో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా నిలిచారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి బాలకృష్ణ హాజరైన సందర్భంగా తీసిన ఓ పిక్..వైరల్‌గా మారింది.
టీడీఎల్పీలో ఆరా తీసిన తోటి ఎమ్మెల్యేలు..
సోమవారం ఆరంభమైన శాసనసభ ప్రత్యేక సమావేశాలను దృష్టిలో ఉంచుకుని.. తెలుగుదేశం పార్టీ సభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి బాలకృష్ణ హాజరయ్యారు. దీనితో ఆయన న్యూ లుక్ వెలుగులోకి వచ్చింది. కొత్త, కొత్తగా కనిపించిన బాలకృష్ణను తోటి ఎమ్మెల్యేలు పలకరించారు. సరికొత్త అవతారం గురించి ఆరా తీశారు. తన తదుపరి సినిమా కోసమేనంటూ బాలకృష్ణ సమాధానం ఇచ్చారు.

రూలర్ క్యారెక్టర్‌కు భిన్నంగా..
ఇదివరకు రూలర్ సినిమా కోసం కూడా ట్రిమ్‌గా కనిపించారు. ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ అధినేతగా కనిపించడానికి చిరుగడ్డంతో నటించారు. తాజా గెటప్.. దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గుండు, బుర్ర మీసాలతో బాలకృష్ణ కనిపించడం.. సినిమాపై ఓ అంచనా ఏర్పడటానికి కారణమౌతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోయే సినిమాలో నందమూరి నటసింహం గెటప్ ఇదేనంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ స్టిల్‌ను వైరల్ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications