మద్దతివ్వండి: జగన్‌పార్టీకి ఆదాల, డిగ్గీకి సిఎంపై ఫిర్యాదు

న్యూఢిల్లీ/హైదరాబాద్: తాను రాజ్యసభ ఎన్నికల బరి నుండి తప్పుకునే ప్రసక్తి లేదని ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం పునరుద్ఘాటించారు. సమైక్యాంధ్ర కోసమని శాసన సభ్యులు బలవంత పెడితేనే తాను బరిలో నిలిచానని తెలిపారు. కొందరు తన పైన విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సమైక్యాంధ్ర కోరుకునే వారు తనకు మద్దతివ్వాలని ఆదాలా ప్రభాకర్ రెడ్డి కోరారు. సమైక్యాంధ్ర కోరుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, సిపిఎం పార్టీల ఎమ్మెల్యేలు తనకు మద్దతివ్వాలని కోరారు. కాగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యులు శ్రీధర్ కృష్ణా రెడ్డి ఆదాలకు మద్దతు పలికారు.

 Adala Prabhakar Reddy

కిరణ్ పైన డిగ్గీకి ఫిర్యాదు

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం సమావేశమయ్యారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై దిగ్విజయ్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రులు జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, రాంరెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు దిగ్విజయ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

విభజన విషయంలో కాంగ్రెస్, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆరోపించారు. ఉదయం ఆయన బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజనపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో ముందకెళ్లాలని తాము మొదటి నుంచి చెప్తున్నామని, విభజనపై ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు.

సిఎం, డిప్యూటీ సిఎం రెండు వర్గాలుగా మారారన్నారు. రాష్ట్రపతి, జాతీయ నేతలను కలిసి కాంగ్రెస్ కుట్రలను తెలియజేస్తామని చెప్పారు. విభజనలో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. విభజన విధానం సరిగాలేదని ఎప్పటి నుంచో చెబుతున్నామని, తప్పుడు తడకగా బిల్లును పంపి వీగిపోయేలా చేశారనన్నారు. దీనిపై ఇంకా ముందుకెళ్తాననడం సరికాదని హెచ్చరించారు.

తెలుగు జాతిని నిర్వీర్యం, విచ్ఛిన్నం చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. ప్రాంతాలవారీగా విడగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విభజనపై కిరణ్ పోరాడాల్సింది రోడ్లపై కాదని, సోనియా గాంధీతో అన్నారు. సోనియా ఇంటి ఎదుట ధర్నా చేసే ధైర్యం కిరణ్, జగన్‌లకు లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+