జగన్‌తో భేటీ: వైయస్సార్ కాంగ్రెస్‌లోకి ఆదినారాయణ రెడ్డి

త్వరలోనే నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గానికి కూడా జగన్ పార్లమెంటు సభ్యుడు కాబట్టి నియోజకవర్గం సమస్యలు చర్చించినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా మాజీ శాసనసభ్యుడు అల్లూరి కృష్ణం రాజు సోమవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజుకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అల్లూరి కృష్ణంరాజు చెప్పారు. జగన్ బెయిల్‌పై విడుదలైన తర్వాత సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారు.












Click it and Unblock the Notifications