ఆదిపురుష్ సినిమా చూడాలనుకుంటున్నారా?
జగదానంద కారకుడైన రాముడి పాత్రలో ఇప్పటివరకు నటించినవారంతా మీసం లేకుండా నటించారు. కానీ తన 21వ సినిమాగా ఆదిపురుష్ ను చేసిన ప్రభాస్ రాముడి పాత్రలో మీసంతో కనిపించబోతున్నారు. రాముడి పాత్ర పోషించేందుకు ముందు జంకిన ప్రభాస్ తర్వాత డైరెక్టర్ కు ఫోన్ చేసి ప్రజలకు చేరువయ్యేలా ఉండాలంటే ఏం చేయాలో చర్చించుకొని ముందుకు అడుగువేశారు.
* సీత పాత్రలో కృతి సనన్ నటించింది. కృతికి ముందు అనుష్క, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి.
* సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. రావణాసరుడి పాత్ర పోషించారు.
* రామాయణం తీయడానికి ముందు దర్శకుడు ఓం రౌత్ చేసిన సినిమాలు రెండే. అవి.. లోక్ మాన్య్, తానాజీ.
* అయోధ్యలో టీజర్ ను లాంచ్ చేశారు.
* తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దీనికి చినజీయరుస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
* లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీసింగ్, హనుమంతుడిగా మరో బాలీవుడ్ నటుడు దేవ్‌దత్తా నాగే నటించారు.

* ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10వేలకు పైగా టికెట్లను తెలంగాణలోని అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వనున్నారు.
* హీరో రణబీర్ కపూర్ తనవంతుగా 10వేల టికెట్లను పేద చిన్నారులకు ఉచితంగా ఇవ్వబోతున్నారు.
* ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి 100+1 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నారు.
* బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా 10వేల టికెట్స్‌ను బుక్ చేస్తున్నట్లు ప్రకటించింది.
* సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ట్రిబెకా ఫెస్టివల్' ఆదిపురుష్ ఎంపికైంది. న్యూయార్క్‌లో జూన్ 13న ప్రదర్శిస్తారు.
* సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు (U) సర్టిఫికెట్ జారీచేసింది.
* ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు.
* టీజర్ పై విమర్శలు రావడంతో సంక్రాంతికి విడుదల కావల్సిన సినిమా జూన్ 16కు వాయిదా పడింది.
* వీఎఫ్ఎక్స్ పై మరింత ఎక్కువగా వర్క్ చేశారు. దీనికి రూ.100 కోట్లు ఖర్చుపెట్టారు.












Click it and Unblock the Notifications