Aditya L1: రోజూ 1,440 ఫొటోలు- సూర్యుడి అణువణువూ..!!
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైంది. దీనికోసం ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సెప్టెంబర్ 2వ తేదీన అంటే శనివారం ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 శాటిలైట్.. సూర్యుడి వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీనికి అవసరమైన కౌంట్ డౌన్ కూడా ఆరంభమైంది.

దీన్ని మోసుకెళ్లడానికి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను వినియోగించనుంది ఇస్రో. ప్రయోగించిన రోజు నుంచి ఈ శాటిలైట్ సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 110 నుంచి 120 రోజుల తరువాత ఎల్1కు చేరుకుంటుంది. దీనికి సంబంధించిన తుదిదశ కసరత్తు పూర్తయినట్లు ఇస్రో తెలిపింది.
ఆదిత్య ఎల్1 ప్రైమరీ పేలోడ్.. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్. ఈ మిషన్‌లో అతి ముఖ్యమైన పేలోడ్ ఇదే. సూర్యుడి కొరొనాను అధ్యయనం చేయడంలో దీనిదే కీ రోల్. సూర్యుడి గురించి సమగ్రంగా విశ్లేషించడానికి ఈ పేలోడ్‌ను పంపించనుంది ఇస్రో. ఎల్1 పాయింట్‌కు చేరిన తరువాత గ్రౌండ్ స్టేషన్‌కు రోజుకు 1,440 ఫొటోలను పంపించే సామర్థ్యం దీనికి ఉంది.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ క్యాంపస్ సంయుక్తంగా విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పేలోడ్‌ను అభివృద్ధి చేశాయి. ఇది పంపించే ఫొటోలు, ఇతర డేటా ఆధారంగా సూర్యుడి గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తుంది ఇస్రో.

సూర్యుడు వివిధ శక్తివంతమైన కణాలు, అయస్కాంత క్షేత్రాన్ని దాదాపుగా అన్ని తరంగ దైర్ఘ్యాలలో రేడియేషన్/కాంతిని విడుదల చేస్తాడనే విషయం తెలిసిందే. దీని నుంచి భూవాతావరణం, దాని అయస్కాంత క్షేత్రం రక్షణ కవచంగా పని చేస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌ను అడ్డుకుంటుంది.
వాటిని దాటుకుని వివిధ రేడియేషన్లు భూఉపరితల వాతావరణంపైకి చేరుకోవడం అసాధ్యం. ఈ రేడియేషన్‌ల ఆధారంగా సూర్యుడిపై ఇప్పటివరకూ ఎవరూ అధ్యయనం చేయలేదు. సూర్యుడి నుంచి వెలువడే సౌర పవనాలు, అందులో నుంచి ఉత్పన్నం అయ్యే కణాలు, అయస్కాంత క్షేత్రం అంతరిక్షంలో ఎలా ప్రయాణం చేయగలుగుతుందనేది ఈ విశ్లేషణల ద్వారా తెలుసుకోవాలని భావిస్తోంది ఇస్రో.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications