కల్తీ షాక్: విశాఖలో ఆయిల్ మాఫియా, వాడిందే మళ్లీ రీసైక్లింగ్ చేసి!
హైదరాబాద్ లోని పలు హోటల్స్ నుంచి వినియోగించిన ఆయిల్ ను వీరు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.
విశాఖపట్నం: విశాఖలో కల్తీ ఆయిల్ మాఫియా గుట్టు రట్టయింది. నగరంలోని కృష్ణ కాలేజీ సమీపంలోని ఓ చిన్న ఇంట్లో 2వేల లీటర్ల కల్తీ ఆయిల్‌ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
అధికారుల దాడులతో కల్తీ ఆయిల్ గ్యాంగ్ అక్కడినుంచి పరారైంది. దాడుల్లో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ డబ్బాలను సీజ్ చేశారు. ఒక్కో డబ్బాలో 20లీటర్ల కల్తీ ఆయిల్ నిల్వ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లోని పలు హోటల్స్ నుంచి వినియోగించిన ఆయిల్ ను వీరు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.

తిరిగి అదే ఆయిల్‌ను కెమికల్ ట్రీట్ మెంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి మళ్లీ హోటల్స్‌కు విక్రయిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications