తండ్రి, కొడుకులను పోలీసులు అరెస్టు
ఇంట్లో పనికి చేరిన దళిత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు.. అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటకు చెందిన 16సంవత్సరాల దళిత బాలిక.. తొమ్మిది నెలల క్రితం నగరంలోని కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీలో నివసించే న్యాయవాది మేడిపల్లి సుధాకర్రెడ్డి ఇంట్లో పనికి కుదిరింది. మరో ఇంట్లో పనిచేయాల్సిన అవసరం నీకు లేదని మాయమాటలు చెప్పి బాలికను మరో ఇంటికి వెళ్లకుండా సుధాకర్ రెడ్డి కట్టడి చేశాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇలా కొంత కాలం తరువాత.. సుధాకర్ రెడ్డి కుమారుడు న్యాయశాస్త్రం చదువుతున్న భరత్ కుమార్ రెడ్డి కూడా ఆమెని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.












Click it and Unblock the Notifications