ఆంధ్రప్రదేశ్: 18 శతాబ్దాల తర్వాత మళ్లీ రాజధానిగా 'అమరావతి'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి ప్రజా రాజధానిగా నిర్మిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారు.
ఇదిలా ఉండే, మళ్లీ పద్దెనిమిది శతాబ్దాల అనంతరం.. అమరావతి రాజధానిగా విరాజిల్లబోతోంది. అమరావతికి ఎంతో చరిత్ర ఉంది. ఈ కారణంగానే అమరావతిని ఏపీ ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసుకుంది.
Photos: అమరావతి శంకుస్థాపన

అమరావతి ఒకప్పుడు శాతవాహనుల రాజధాని. గతంలో రాజధానిగా విరాజిల్లిన అమరావతి సువిశాలమైనది. నాటి అమరావతిలో ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలోని ప్రాంతాలు కూడా ఉండేవి.
అలాంటి చారిత్రక రాజధాని అమరావతిని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధానిగా ఎంచుకుంది. ఇందుకోసం 33వేల ఎకరాలు సేకరించింది. సమైక్య ఏపీ విభజన అనంతరం విభజిత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. దీంతో, గుంటూరు - కృష్ణా జిల్లాల్లోని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. తద్వారా, 18 శతాబ్దాల తర్వాత అమరావతి రాజధానిగా విరాజిల్లబోతోంది.












Click it and Unblock the Notifications