• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ అడిగారు - ప్రధాని ఓకే చేసారు : అసాధారణం - బలమైన బంధంతో..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ అడిగారు. ప్రధాని ఓకే చేసారు. కొందరి విషయంలోనే ప్రధాని మోదీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆయన ఎనిమిదేళ్ల పాలనలో స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కు మరో ఆరు నెలల పాటు పొడిగింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు తొలుత ఆరు నెలల పొడిగింపు ఇచ్చిన కేంద్రం..ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగింపు ఇవ్వటం ఇప్పుడు ప్రత్యేక అంశం గా మారుతోంది. సాధారణంగా తొలుత మూడు నెలలు..ఆ తరువాత మూడు నెలలు ఇచ్చిన సంఘటనలు ఏపీలో గతంలో ఉన్నాయి.

అసాధారణ నిర్ణయంగా

అసాధారణ నిర్ణయంగా


ప్రస్తుత సమీర్ శర్మకు గత ఏడాది నవంబర్ నెలాఖరుతో పదవీ కాలం ముగిసింది. అప్పుడు ఏపీ ప్రభుత్వ కోరటంతో తొలుత ఆరు నెలల పాటు పొడిగింపు ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఏకంగా మరోసారి ఆరు నెలల పొడిగింపు అనేది ప్రధాని స్థాయిలో జరిగిన నిర్ణయం కావటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. సమీర్ శర్మకు ఆరు నెలల పొడిగింపు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 12న సీఎం జగన్ నేరుగా ప్రధానికి లేఖ రాసారు. దీనికి సంబంధించి అప్పటికే వైసీపీకి చెందిన ముఖ్యనేత ప్రధాని కార్యాలయంలో ఈ పొడిగింపుకు సంబంధించి సంప్రదింపులు చేసారు.

సీఎం జగన్ లేఖ రాయటంతో..ప్రధాని ఓకే

సీఎం జగన్ లేఖ రాయటంతో..ప్రధాని ఓకే


అయితే, కేవలం ప్రధాని నిర్ణయిస్తే మినహా..ఏకంగా ఆరు నెలలు పొడిగింపు ఇవ్వలేమని..ఇప్పటికే ఆరు నెలలు ఇచ్చి ఉండటంతో ఇక సాధ్యపడదని సమాచారం ఇచ్చారు. దీంతో..నేరుగా ప్రధానికి సీఎం లేఖ రాసారు. సీఎం జగన్ కోరిన విధంగా.. అఖిల భారత సర్వీసు నిబంధనలకు మినహాయింపు ఇచ్చి మరీ ఏపీ సీఎస్ కు ఆరు నెలల పాటు పొడిగింపు ఇస్తూ ప్రధాని స్థాయిలో నిర్ణయం జరిగింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇటువంటి నిర్ణయాల్లో ప్రధాని జోక్యం చేసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, పీఎం మోదీ - సీఎం జగన్ మధ్య ఉన్న సంబంధాలతో ఈ నిర్ణయం ఇంత ముందుగా వెలువడిందని భావిస్తున్నారు.

ఇద్దరి రాజకీయ బంధం బలంగా ఉందంటూ

ఇద్దరి రాజకీయ బంధం బలంగా ఉందంటూ

ఇటువంటి అవకాశం ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రానికే మాత్రమే గతంలో ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఆర్దిక నిర్వహణలో ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు రావటం..వాటి పైన కేంద్రమే రాష్ట్రానికి లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో..ప్రధాని అధికార యంత్రాంగానికి కీలకమైన సీఎస్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. దీని ద్వారా ప్రధాని మోదీ - సీఎం జగన్ మధ్య సత్సంబంధాలు బలంగా ఉన్నాయనే విషయం స్పష్టం అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Central DOPT Extended CS Sameer Sarma tenure for six months more, After CM JAgan Request PM Modi accepted this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X