విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో హై అలర్ట్- తొలి కరోనా పాజిటివ్ నేపథ్యంలో రెండు రోజులు కర్ఫ్యూ పొడిగింపు ?

|
Google Oneindia TeluguNews

ఏపీ నడిబొడ్డున ఉన్న విజయవాడలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. పారిస్ నుంచి ఢిల్లీ మీదుగా విజయవాడ చేరుకున్న విద్యార్ధి ఈ నెల 20న ఆస్పత్రిలో చేరగా.. 21న పాజిటివ్ గా నిర్దారించారు. దీంతో అతనికి చికిత్స అందిస్తూనే విజయవాడలో కరోనా విస్తరించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగ ఏప్రిల్ 14 వరకూ 144 సెక్షన్ కూడా విధించారు.

 తొలికేసు నమోదుతో అప్రమత్తం...

తొలికేసు నమోదుతో అప్రమత్తం...

పారిస్ నుంచి తాజాగా నగరానికి వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్‌-19 నివారణకు ప్రజలు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కొవిడ్‌ లక్షణాలు ఉంటున్నాయని, వారు విధిగా నిబంధనలు, సూచనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూచనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం డీజీపీ చేశారు.

 ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌ : సీపీ

ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌ : సీపీ

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సీపీ తిరుమల రావు తెలిపారు. రేపటి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా సోకిన యువకుడికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారని చెబుతున్నా వారికీ పరీక్షలు అవసరమని, వారి కుటుంబ సభ్యులు బయటికి వస్తే వైరస్‌ విస్తరించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అందరూ స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని సీపీ కోరారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
ప్రత్యేక కంట్రోల్ రూమ్..

ప్రత్యేక కంట్రోల్ రూమ్..

తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడలో పోలీసులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కరోనా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 7995 2442 60 ఏర్పాటు చేయడంతో పాటు ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చని నగర పోలీసుకమిషనర్ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు.

English summary
after detection of corona positive case, curfew to extend for two more days, first coronavirus case in vijayawada, recently student came from paris to vijayawada via delhi found coronavirus positive, officials declare vijayawada on high alert
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X