నిన్న జూనియర్ ఎన్టీఆర్, నేడు తారకరత్న: నచ్చిందని రూ.లక్షలు ఖర్చు
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా నరసారావుపేట ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ఆన్‌లైన్ వేలంలో ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఆయన 9999 నెంబర్‌కు రూ.6 లక్షలకు దక్కించుకున్నారు.
ఈ నెంబర్ కోసం పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. రూ.6 లక్షలు పలకడంతో తారకరత్నకే ఈ నెంబర్ దక్కింది. గతంలో 9999 నెంబర్‌కు నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

గతంలో జూ ఎన్టీఆర్ భారీ మొత్తం వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కుంచుకున్నారు. తన బీఎండబ్ల్యూ కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ వేలంలో పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ వేలంలో మరో ముగ్గురు కూడా పాల్గొన్నారు. తనకు లక్కీ నెంబర్ కావడంతో లక్షలు వెచ్చించడానికి కూడా వెనకాడలేదు జూనియర్.
టీఎస్ 09ఈఎల్ 9999 నెంబర్‌ను ఎన్టీఆర్ దక్కించుకున్నాడు. ఈ నెంబర్ కోసం రూ. 10.50లక్షలు వెచ్చించారు. ఈ నెంబర్‌లో దాదాపు అన్ని 9అనే అంకే ఉండటం గమనార్హం. 9 అంకే తెలుగుదేశం వ్యవస్థాపకుడు, జూ.ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామరావుకు కూడా లక్కీ నెంబర్.












Click it and Unblock the Notifications