షాక్ :కూతురును హత్య చేసి, తాను ఆత్మహత్యచేసుకొన్నాడు

కూతురును చంపి ఓ తండ్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది. శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి తన ఆరేళ్ళకూతురును చంపి , ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు.

గుంటూరు :తన ఆరేళ్ళ కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకొన్నాడు ఓ తండ్రి . భార్య కొన్నేళ్ళ క్రితం చనిపోయింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ పనిచేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

after murder his daughter he sucide

గుంటూరు జిల్లాలోని చుండూరు మండల పరిధిలోని పరిమి గ్రామంలో ఆరేళ్ళ చిన్నారి చైతన్య పద్మ ను ఆమె తండ్రి శ్రీకృష్ణదేవరాయలు చంపివేశాడు. ఆమెను చంపివేసిన తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శ్రీకృష్ణ దేవరాయల భార్య కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయింది. కూతురుతో కలిసి ఆయన జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో పాటు భార్య చనిపోయిందనే మనోవేదనతో ఆయన ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు భావిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకొంటే తన కూతురు అనాథగా మారిపోయే ప్రమాదం ఉందని భావించిన అతను తొలుత కూతురును చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకొన్నాడని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+