అసెంబ్లీలో అమరావతి రచ్చ- టీడీపీ ఎమ్మెల్యేలంతా సస్పెన్షన్-ఒక్కరోజు పాటు

ఏపీ అసెంబ్లీలో ఇవాళ మూడు రాజధానులు, అమరావతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో భాగంగా అమరావతిలో టీడీపీ నేతల భూముల కొనుగోళ్లు, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలకు దిగారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. వారిని తమ స్ధానాల్లోకి వెళ్లమని స్పీకర్ తమ్మినేని పదే పదే కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరికి సభలో నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

పరిపాలనా వికేంద్రీకరణపై చర్చ జరుగుతుందని దీన్ని అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడంలేదని ఆర్ధికమంత్రి బుగ్గన పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ , వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సప్పెండ్ చేయాల్సిందిగా శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీకర్ కు సూచించారు.

after protests against three capitals, tdp mlas suspended from ap assembly for today

దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులందరినీ ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అమరావతిపై మాజీ మంత్రి కన్నబాబు చర్చను కొనసాగించారు. అయితే గతంతో పోలిస్తే ఇవాళ సభలో టీడీపీ సభ్యులు మాట్లాడే అవకాశం దక్కింది. అయితే మంత్రులకూ, టీడీపీ సభ్యులకు మధ్య వాగ్వాదాలు మాత్రం చోటు చేసుకున్నాయి. దీంతో ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+