బాబుకు షాక్ మీద షాక్: రేవంత్ తర్వాత ఉమామాధవ రెడ్డి, హామీ వచ్చింది?

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనంతరం మరో వికెట్ పడనుందా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన, టిడిపి సీని

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనంతరం మరో వికెట్ పడనుందా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఉమామాధవ రెడ్డిపై ప్రచారం

ఉమామాధవ రెడ్డిపై ప్రచారం

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన, టిడిపి సీనియర్ నేత ఉమా మాధవ్ రెడ్డి కూడా టిడిపిని వీడే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. ఆమె భువనగిరి నియోజకవర్గం నాయకురాలు.

రేవంత్ చెప్పిన కీలక నేత వ్యాఖ్యలు

రేవంత్ చెప్పిన కీలక నేత వ్యాఖ్యలు


రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తుంటే రేపోమాపో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తర్వాత ఉమామాధవ రెడ్డి వరుసలో ఉన్నారని అంటున్నారు. తనకు ప్రచార బాధ్యతలు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే తాను కీలక నేతలను కాంగ్రెస్ లోకి తీసుకు వస్తానని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

భువనగిరి టిక్కెట్ పైన హామీ

భువనగిరి టిక్కెట్ పైన హామీ

ఉమా మాధవ రెడ్డితో ఇప్పటికే చర్చలు జరిగాయనే ప్రచారం సాగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో భువనగిరి టిక్కెట్ ఇస్తామని హామీ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

అలాంటి సమాచారం లేదని రమణ

అలాంటి సమాచారం లేదని రమణ

ఉమా మాధవ రెడ్డి టిడిపిని వీడుతున్నట్లుగా ప్రచారం జరగడంపై తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ స్పందించారు. తమకు అలాంటి సమాచారం ఏదీ లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+