పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దపడ్డ ఆయన పోలీసులు అరెస్టు చేసి, ఆ తర్వాత ఆసుపత్రికి తరలించినా.. ఎట్టి పరిస్థితుల్లోను తన దీక్షను విరమించేంది లేదని తేల్చి చెబుతున్నారు.
తునిలో జరిగిన కాపు ఆందోళన సభ హింసాకాండకు దారి తీయడం, ఆ హింసాకాండకు కుట్రదారులు వీరేనంటూ ప్రభుత్వం కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో.. తుని సభ అల్లర్ల
సందర్భంగా కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయడంతో పాటు, అరెస్టు చేసినవారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన స్వగృహం కిర్లంపూడిలో ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
అయితే నాటకీయ పరిణామాల మధ్య ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ ముద్రగడను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సకు ఏమాత్రం సహకరించని ముద్రగడ తన దీక్షను ఆపేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలోను ఆయను దీక్ష కొనసాగుతోంది.

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
ఆమరణ దీక్ష సందర్భంగా.. మీడియాకి తమ డిమాండ్లను చేస్తున్న తెలియజేస్తున్న ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులు. కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళనలో కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఒకవేళ దాని ఖరీదు తమ ప్రాణాలే అని భావిస్తే.. ప్రాణ త్యాగానికైనా సిద్దం అంటూ మీడియాకు వెల్లడిస్తున్న ముద్రగడ.

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
ఆమరణ దీక్షకు ముందు మీడియాతో మాట్లాడిన ముద్రగడ కాపుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన చర్యలేవి లేకపోతే తన దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
ముద్రగడ దీక్షను విరమింపజేయాలని యోచిస్తున్న ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులను ముద్రగడ ఇంటి ముందు మోహరించింది. ఆ సందర్భంగా పోలీసులతో మాట్లాడుతూ తన దీక్షకు భంగం కలిగించవద్దని పోలీసులకు చెబుతున్న ముద్రగడ పద్మనాభం..

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
ముద్రగడ అరెస్టు సందర్భంగా.. అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ ఇంటివద్ద చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల్లో పోలీసులు ఓ ఆందోళనకారుడిని వెంబడిస్తున్న ద్రుశ్యం.

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
ఎట్టకేలకు తలుపులు బద్దలు కొట్టి మరీ ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు, అనంతరం ఆయన్ను పోలీసు వ్యానులో ఎక్కించడానికి తరలిస్తుండగా చోటు చేసుకున్న ఉద్రిక్త...

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
పోలీసు హహనంలో ముద్రగడను తరలించిన పోలీసులు.. ఆసుపత్రిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సందర్భం..

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
మొత్తానికి చికిత్స నిమిత్తం ముద్రగడను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పలువురు పోలీసు సిబ్బంది, వైద్యులు కలిసి ముద్రగడను చికిత్స విభాగానికి తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వైద్యులు ఎంతగా ప్రయత్నించిన ముద్రగడ మాత్రం చికిత్స నో అంటున్నట్టుగా సమాచారం.

పట్టు వదలని విక్రమార్కుడిలా ముద్రగడ.. : చికిత్సకు 'నో..' ఆసుపత్రిలోను దీక్ష (పిక్చర్స్)
ముద్రగడ అరెస్టు సందర్బంగా, ముద్రగడతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు వ్యానులో వారిని తరలిస్తున్న సందర్భమిది..
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్

Click it and Unblock the Notifications