వంశీ తరువాత అరెస్ట్ లిస్టులో నెక్స్ట్ 'ఆయనే'..!?
వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంశీ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున అంచనాలు వెలు వడ్డాయి. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీ అరెస్ట్ అవుతారని భావించారు. వంశీ న్యాయస్థానం ఆశ్రయించటంతో అరెస్ట్ సాధ్యపడలేదు. ఇప్పుడు టీడీపీ కార్యాలయ ఉద్యోగి కిడ్నాప్ .. బెదిరింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక, ఇప్పుడు వంశీ తరువాత అరెస్ట్ లిస్టులో ఉన్నదెవరనే చర్చ మొదలైంది.
వంశీ అరెస్ట్ తో
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ప్రత్యేకంగా వంశీ తో పాటుగా మరి కొందరు నేతల పైన గురి పెట్టారు. ఎన్నికల్లో వంశీతో సహా టీడీపీ గురి పెట్టిన మరో ముగ్గురి నేతలను ఓడిం చారు. కూటమి ప్రభుత్వం వస్తూనే వంశీ అరెస్ట్ ఉంటుందనే చర్చ సాగింది. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కొనసాగు తోంది. ఇంతలో ఈ కేసు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్య వర్ధన్ కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ వంశీపై ఫిర్యాదు చేశారు.

తదుపరి ఎవరు
ఇక, ఇప్పుడు వంశీ అరెస్ట్ కావటంతో.. ఆయన పైన ఉన్న అన్ని కేసులను పోలీసులు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. వంశీ తరువాత అరెస్ట్ లిస్టులో నెక్స్ట్ ఎవరనే చర్చ మొదలైంది. వంశీతో పాటుగా మాజీ మంత్రి కొడాలి నాని పైన టీడీపీ తొలి నుంచి గురి పెట్టింది. కొడాలి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మౌనంగా ఉంటున్నారు. రాజకీయంగానూ పెద్దగా యాక్టివ్ గా కనిపించటం లేదు. కొడాలి నాని విషయంలో చర్యలు తీసుకోవాలని టీడీపీ కేడర్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు వైసీపీ నేతలు మాత్రం రాజకీయ ప్రతీకారంగా విమర్శిస్తు న్నారు. ఇక, రెడ్ బుక్ పాలన అంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
నెక్స్ట్ ఆయనేనా
2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీని వైసీపీలోకి తీసుకెళ్లే విషయం దగ్గర నుంచి అన్నీ కొడాలి నాని తానై వ్యవహరించారు. ఆ తరువాత గన్నవరంలో వైసీపీ నేతల నుంచి వంశీ విషయంలో వ్యతిరేకత వచ్చినా జగన్ ను ఒప్పించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతల పైన కొడాలి నాని అనుచిత వ్యాఖ్యల తో విరుచుకుపడేవారు. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు. వంశీ అరెస్ట్ తరువాత నాని పైన చర్యలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో, రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications