మళ్లీ ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోల మృతి, స్వగ్రామానికి ఆర్కే కొడుకు మృతదేహం
మల్కాన్‌గిరి/విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ అటవీప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సోమ, మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రశ్రేణి నాయకులతో సహా 28 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఘటనతో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరింది.

కాగా, ఏవోబీలో కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా పోలీసు బలగాల మల్కాన్‌గిరి ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. నాలుగు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీ డీజీపీ, ఒడిశా పోలీసులు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సొంత గ్రామానికి ఆర్కే కుమారుడి మృతదేహం
సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా మృతదేహాన్ని అతని సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం అల్లాపూర్‌కు తరలించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అక్కడికి భారీ ప్రజలు చేరుకున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం మున్నా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications