బెంగళూరు నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు: హాల్ట్ స్టేషన్లు
Special Trains: ఈ నెల 23వ తేదీన పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి. ఇది ఆయన 101వ జయంతి ఉత్సవాలు. ఇందులో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి చేరుకోనున్నారు. ఈ శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ప్రశాంతి నిలయం ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఆ రోజున పలు ఆధ్యాత్మిక సమావేశాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీకి చెందిన భక్తులు పుట్టపర్తిని సందర్శించడానికి వీలుగా రైల్వే అధికారులు ప్రత్యేకంగా రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. శ్రీకాకుళం రోడ్, విజయవాడతో పాటు సంత్రాగచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా రైల్వే అధికారులు విడుదల చేశారు. ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.

సంత్రాగచ్చి- ప్రశాంతి నిలయం
ఈ నెల 17, 24 తేదీల్లో మంగళవారం మధ్యాహ్నం 12:40 నిమిషాలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరే నంబర్ 08031 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 9: 30 గంటలకు శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ నెల 18, 25 తేదీల్లో బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీసత్యసాయి పుట్టపర్తి నుంచి బయలుదేరే నంబర్ 08032 ప్రత్యేక రైలు మూడో రోజు ఉదయం 8 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.
ఖరగ్ పూర్, బాలేశ్వర్, భద్రక్, జైపూర్ కియొంఝర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, విజయనగరం, సింహాచలం నార్త్, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, గుత్తి, ధర్మవరం మీదుగా ఈ ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది.
శ్రీకాకుళం రోడ్- బెంగళూరు (యలహంక)
ఈ నెల 20వ తేదీన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరే నంబర్ 08555 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు యలహంకకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు యలహంక నుంచి బయలుదేరే నంబర్ 08556 రైలు మరుసటి రోజు సాయంత్రం 5:15 నిమిషాలకు శ్రీకాకుళం రోడ్ కు చేరుకుంటుంది.
చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమిట్ట, నంద్యాల, డోన్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
యలహంక- విజయవాడ
ఈ నెల 21వ తేదీన శనివారం సాయంత్రం 5 గంటలకు యలహంక నుంచి బయలుదేరే నంబర్ 07246 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:45 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ నెల 23న సోమవారం రాత్రి 11:50 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరే నంబర్ 07245 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు యలహంకకు చేరుకుంటుంది.
ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, డోన్, నంద్యాల, దిగువమిట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్, దొనకొండ, నరసరావపేట, గుంటూరు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.













Click it and Unblock the Notifications
