అవిశ్వాసం?: అన్నాడీఎంకే ఎంపీల ఆందోళన, ఉభయసభలు రేపటికి వాయిదా, తెలుగు ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామం తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమైన లోకసభ, రాజ్యసభ సమావేశాల్లోనూ అన్నాడీఎంకే ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగించారు. స్పీకర్ వెల్‌ను చుట్టుముట్టి కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో లోకసభను ప్రారంభమైన నిమిషంలోనే మధ్యాహ్నం 12గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ.. అన్నాడీఎంకే సభ్యులు తమ ఆందోళనలను కొనసాగించారు. దీంతో ఆ సభ్యులపై స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lok Sabha adjourned till tomorrow after AIADMK MPs protest demanding formation of #CauveryManagementBoard pic.twitter.com/ivYtj0bmlt
— ANI (@ANI) April 2, 2018
సభా సజావుగా సాగడం లేదని, ఈ పరిస్థితుల్లో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం లేదని చెప్పారు. ఆ తర్వాత కూడా సభ్యులు తమ ఆందోళనలను కొసాగించడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్.
ఇక రాజ్యసభలోనూ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో సభ్యుల తీరుపై ఛైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చిద్దామని అన్నారు. అయినా, ఆందోళనలు ఆగని నేపథ్యంలో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

ఇది ఇలా ఉండగా, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాలు తొమ్మిదో రోజైన సోమవారం కూడా చర్చకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకసభ వాయిదా పడటంతో టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనలు చేపట్టారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్.. పరశురాముని వేషాధారణలో నిరసన తెలియజేశారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతున్నామని ఎంపీ మురళీ మోహన్ అన్నారు.
Delhi: TDP MPs continue to protest in front of Mahatma Gandhi statue in Parliament demanding special category status for Andhra Pradesh. #budgetsession pic.twitter.com/l1sbf1OAXL
— ANI (@ANI) April 2, 2018
Recommended Video

కాగా, అన్నాడీఎంకే ఎంపీ ముత్తుకురుప్పన్.. కావేరీ బోర్డును ఏర్పాటు చేయనందుకు నిరసనగా తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు తన రాజీనామాను సమర్పించారు. ఇది ఇలా ఉండగా, తమిళనాడు ప్రజల కష్టాలు తమకు తెలుసని, త్వరలోనే కావేరి వివాదాన్ని పరిష్కరిస్తామని సీజేఐ ప్రకటించారు.












Click it and Unblock the Notifications