ఏపీని వణికిస్తున్న మహమ్మారి.. ఆ కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక విషయం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2023 నివేదిక ఆ భయాందోళనకు కారణంగా మారింది. దేశవ్యాప్తంగా హెచ్ఐవి పాజిటివ్ రోగులలో మొత్తం 3 లక్షల 20వేల మంది హెచ్ఐవి పాజిటివ్ రోగులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెచ్ఐవి బాధితుల సంఖ్య పెరుగుతుందని, ఎయిడ్స్ ఉధృతంగా ఉందని తాజా నివేదిక స్పష్టం చేసింది.
ఏపీలో ప్రతి మిలియన్ జనాభాకు 651మంది హెచ్ఐవి రోగులు
ప్రతి సంవత్సరం ఏపీలో 3510మంది హెచ్ఐవి బారిన పడుతున్నారని, 2023సంవత్సరంలోనే రాష్ట్రంలో 5310మంది హెచ్ఐవి పాజిటివ్ తో మరణించారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మిలియన్ జనాభాకు 651మంది హెచ్ఐవి రోగులు ఉన్నారని. ఈ హెచ్ఐవి విస్తృతి 15సంవత్సరాల నుండి 49సంవత్సరాల వయసు ఉన్న వారిలోనే 0.62శాతం మేర నమోదయిందని నివేదిక వెల్లడించింది. ఇది జాతీయ సగటు 0.20%కంటే అధికంగా ఉందని పేర్కొంది.

ఏపీలో జిల్లాల వారీగా హెచ్ఐవీ బాధితులు
ఏపీలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో హెచ్ఐవి రోగులు ఉన్నారని, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 19,865 మంది హెచ్ఐవి రోగులు ఉండగా, ఆ తర్వాత స్థానాలలో కాకినాడ 18,234 మంది హెచ్ఐవి బాధితులు, తూర్పుగోదావరి 17,618 మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు, పల్నాడు 17,536మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు, గుంటూరు జిల్లాలో 16,630 మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు, ప్రకాశం జిల్లాలో 16,280 మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నారని పేర్కొంది.
ఈ జిల్లాలలో పదివేలకు మించిన కేసులు
విశాఖపట్నం జిల్లాలో 15,999మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు, పశ్చిమగోదావరి జిల్లాలో 15,612మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు, ఏలూరు జిల్లాలో 15,573మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు, అనంతపురం జిల్లాలో 14,862మంది, అనకాపల్లి జిల్లాలో 13491మంది, కృష్ణాజిల్లాలో 13,166మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 11,089మంది, బాపట్లలో 11356 మంది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10,567 మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నట్టు వెల్లడించింది.
ఈ జిల్లాలలోనే అత్యధిక, అత్యల్ప కేసులు
ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో హెచ్ఐవి పాజిటివ్ బాధితుల సంఖ్య పదివేల లోపు ఉన్నట్టుగా పేర్కొంది. ఇక అత్యధికంగా 2023లో హెచ్ఐవి పాజిటివ్ బారిన పడిన జిల్లాలలో ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలు నిలిచాయి. అత్యంత సంఖ్యలో హెచ్ఐవి పాజిటివ్ బారిన పడిన జిల్లాలలో గుంటూరు, వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు జిల్లాలు నిలిచాయి. హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రస్తుతం ఈ నివేదిక ఏపీ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. ఏపీలో ఎయిడ్స్ కంట్రోల్ కోసం మరింత అవగాహన కలిగించాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తుంది.












Click it and Unblock the Notifications