ఎయిర్ హోస్టెస్ హత్య: ఇల్లు అమ్మి బిజినెస్‌లో పెట్టాలని రీతుపై ఒత్తిడి
హైదరాబాద్: మీ స్వస్థలంలోని ఇంటిని అమ్మి, తన వ్యాపారంలో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాలని మృతి చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు ఉప్పల్‌ను భర్త సచిన్ నిత్యం వేధించే వాడని తెలుస్తోంది. రీతు కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఇచ్చేందుకు అంగీకరించకపోవడం పైన సచిన్ కోపంతో ఉండేవాడని చెబుతున్నారు.
వ్యాపారంలో పెట్టుబడి కోసం నిత్యం రీతును వేధించేవాడు. అందుకోసం ఎప్పుడు ఆమెతో తగవుపడేవాడు. జంషెడ్ పూర్‌లోని ఇంటిని అమ్మి రూ.పది లక్షలు ఇవ్వమని రీతు తండ్రిని డిమాండ్ చేసేవాడు. అప్పటికే కట్నం రూపంలో వారు పదిహేను పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు.

ఆ తర్వాత ఇంటిని అమ్మేయమని ఒత్తిడి చేసేవాడు. అయితే, ఆ ఇంటిని అమ్మితే తాము ఎక్కడ ఉండాలని రీతు తల్లిదండ్రులు ప్రశ్నించేవారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తన భార్య రీతు పేరిట ఓ ఇల్లు ఉందని సచిన్ విన్నాడని తెలుస్తోంది.
దీంతో, కోల్‌కతాలోని ఇల్లు అమ్మి, డబ్బులు తీసుకు రావాలని నిత్యం రీతును వేధించేవాడు. ఈ బాధలు భరించలేక కొద్ది రోజుల క్రితం రీతు ఉప్పల్ అతని నుండి వేరుగా ఉండి జీవించడం ప్రారంభించింది. అయితే, అతను మారాడని భావించి కొద్ది రోజుల తర్వాత తిరిగి భర్త వద్దకు వెళ్లింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications