విజయవాడ, విశాఖ, రాజమండ్రి నుంచి పలు విమానాలు రద్దు - పూర్తి వివరాలు..!!
మొంథా తుఫాను ప్రభావం విమాన సర్వీసుల పైన పడింది. ఇప్పటిక రైల్వే శాఖ భారీ స్థాయిలో రైళ్లను రద్దు చేసింది. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేసిన అధికారులు.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 72 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక.. విశాఖ- విజయవాడ నుంచి పలు విమాన సర్వీసులను నిలిపివేవేస్తూ ఏయిర్ పోర్టు అథారిటీలు నిర్ణయించాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారికి సమాచారం ఇస్తున్నారు. తుఫాను తీవ్రతకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.
తుఫాను తీవ్రత కారణంగా పలు విమాన సర్వీసులను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసు రద్దయింది. ఇక్కడి నుంచి 46 సర్వీసులు నడుస్తుండగా.. మంగళ వారం 36 రద్దయ్యాయి. విజయవాడ నుంచి షార్జాకు నడి చే 2సర్వీసులను రద్దు చేసింది. విజయవాడ-విశాఖ మధ్య రెండు, విజయవాడ-బెంగళూరు 2, విజయవాడ-హైదరాబాద్ 2 సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లే 18 ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు రద్దయ్యాయి. కేవలం ఉదయం 10.30 గంటల వరకు విమానాలు మాత్రమే నడుస్తాయి. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి మంగళవారం ఉదయం 9.30గంటల లోపు నడిచే సర్వీసులు మాత్రమే యథావిధిగా నడుస్తాయి. తర్వాత ముంబై, తిరుపతి, బెంగుళూరు, చెన్నైలకు వెళ్లే సర్వీసులన్నీ రద్దు చేశారు.

విశాఖపట్నం విమానాశ్రయం అధికారులు కూడా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు నగరాలకె వెళ్లే మంగళవారం నాటి ఇండిగో, ఎయిరిండియా సర్వీసులను రద్దు చేశారు. దాదాపు 56 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇక, అటు రైల్వే శాఖ పలు రైళ్లను నిలిపి వేసింది. మొంథా తుపాను దృష్ట్యా 70 రైళ్లను రద్దు చేసింది. అలానే తెలంగాణ, చెన్నై నుంచి బయలుదేరి ఏపీ మీదుగా వెళ్లే పలు రైళ్లను కూడా రద్దు చేసింది. ఈ క్రమంలో విజయవాడ డివిజన్ మీదుగా నడిచే రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. రేపు (మంగళవారం), ఎల్లుండి (బుధవారం) బయలుదేరే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. రాజమండ్రి, నిడదవోలు, గుంటూరు, కాకినాడ నుంచి బయలుదేరేవి, తెనాలి, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపురం నుంచి బయలుదేరేవి, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే రైళ్లు రద్దు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications