ఏపీలో మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు- ఈ ప్రాంతాల్లోనే, తాజా నిర్ణయం..!!

ఏపీలో మరో మూడు విమానాశ్రయాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. భోగాపురంలో కొత్తగా ఏర్పాటైన విమానాశ్రయం రేపు(సోమవారం) నుంచి ఆపరేషన్స్ ప్రారంభించనుంది. కాగా, ఇదే సమయంలో మూడు కొత్త ఏయిర్ పోర్టులకు సంబంధించి టెక్నో ఎకనమిక్ ఫిజిబులిటీ రిపోర్ట్ (టీఈఎఫ్‌ఆర్) సిద్దం అయింది. కేంద్ర విమానయాన శాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి అందటంతో.. దీనికి సంబధించి ఆమోదం దిశగా అధ్యయనం కొనసాగుతోంది.

ఏపీలో మరో మూడు ప్రాంతాల్లో విమానాశ్రయాల పైన కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలకు అదనంగా ఈ మూడు నిర్మాణాల పైన అవసరమైన రిపోర్ట్స్ సిద్దం అవుతున్నాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ఇతర ప్రాంతాల్లోనూ కొత్తగా డిమాండ్లు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు రాజధాని అమరావతి, కుప్పం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల పైన అధ్యయనం సాగుతోంది. ఇప్పటికే ఈ మూడు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు పై టెక్నో ఎకనమిక్ ఫిజిబులిటీ రిపోర్ట్(టీఈఎఫ్‌ఆర్) సిద్దం చేసింది. సైట్ క్లియరెన్సుల కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ప్రాంతాల్లో భూ సమీకరణతో పాటుగా తొలి దశలో అయ్యే ఖర్చు పైనా అంచనాలు సిద్దం చేస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపు పై చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
స్థానిక ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపు పై చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
airport-expansion-exercise-begins-in-andhra-pradesh-three-more-set-to-come-up-as-latest-plans

రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలతో

ఈ విమానాశ్రయాల కోసం మొదటి దశలో రూ.5545 కోట్ల ఖర్చు అవుతుందని తేల్చారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 4618 ఎకరాలు అవసరమని ప్రాధమికంగా గుర్తించారు. నిర్మాణం కోసం రూ.4419 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు. వీటిల్లో రూ.1087 కోట్లను రోడ్లు, డ్రైనేజ్, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించనున్నారు. ఇక శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. 1185 ఎకరాలను సేకరించేందుకు అధికారులు సిద్దమయ్యారు. తొలి దశలో రూ.392 కోట్లతో అభివృద్ది చేయనున్నారు. కాగా, కుప్పం ఎయిర్‌పోర్ట్ కోసం 1788 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 1300 ఎకరాలను ఇప్పటికే సేకరించింది. తొలి దశలో రూ.734 కోట్లతో నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వ తాజా ప్రతిపాదనలతో.. కేంద్ర విమానయాన శాఖ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+