కౌరవుల అజయ: భార్య అమలతో నాగార్జున (పిక్చర్స్)
హైదరాబాద్: మహాభారతం ఆధారంగా ఆనంద్ నీలకంఠం రచించిన అజయ పుస్తకాన్ని యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల శనివారం ఆవిష్కరించారు.
సోమాజిగూడ ల్యాండ్ మార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన అందాల నటుడు నాగార్జున మాట్లాడుతూ... గతంలో రచయిత ఆనంద్ నీలకంఠం రచించిన అసుర పుస్తకంలో రామాయణంలో రావణుడు అలా ప్రవర్తించడానికి గల కారణాలను రాసిన తీరు అందరినీ హత్తుకుందన్నారు.
మహాభారతంలోని కౌరవుల పాత్ర ఆధారంగా రచించిన ఆజయ పుస్తకం కూడా అందరి మన్నన పొందాలని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమలతో పాటు రచయిత ఆనంద్ నీలకంఠం, లీడ్ స్టార్ట్ పబ్లిషింగ్ పిఈవో స్వరూప్ నంద పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నాగార్జున
ఆనంద్ నీలకంఠం రాసిన అజయ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున. ఈ కార్యక్రమంలో అమల కూడా పాల్గొన్నారు.

నాగార్జున
ఆనంద్ నీలకంఠం రాసిన అజయ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, సతీమణి అక్కినేని అమల.

అజయ
గతంలో రచయిత ఆనంద్ నీలకంఠం తన అసుర పుస్తకంలో రామాయణంలో రావణుడు అలా ప్రవర్తించడానికి గల కారణాలను రాసిన తీరు అందరినీ హత్తుకుందన్నారు. ఇప్పుడు అజయలో కౌరవుల పాత్రపై రాశారు.

నాగ్
ఆనంద్ నీలకంఠం రాసిన అజయ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున.

నాగార్జున, అమల
ఆనంద్ నీలకంఠం రాసిన అజయ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, సతీమణి అక్కినేని అమల.












Click it and Unblock the Notifications