తెలంగాణ కోసం ఉద్యమం ఎందుకు చేశారా...: అక్బర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం తెరాస ప్రభుత్వం పైన మండిపడ్డారు. బడ్జెట్ చూస్తే తెలంగాణ కోసం ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం కోరానని చెప్పారు. అయితే, ఇంత వరకు సమాధానం లేదన్నారు.
విద్యుత్ సమస్యలాగే ఆర్థిక సమస్య కూడా ఉందన్నారు. దానిని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. ప్రభుత్వం కొన్ని అంశాలను దాస్తోందని చెప్పారు. శ్వేతపత్రాలు ఇచ్చేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో చెప్పాలన్నారు. ఓ మిత్రుడిగా తాను చెబుతున్నానని, శ్వేతపత్రాలు విడుదల చేయాలన్నారు.

వాటర్ గ్రిడ్లో నల్గొండ జిల్లాకు ప్రాధాన్యం: కేసీఆర్
ఫ్లోరైడ్ అన్నింటికంటే ప్రధాన సమస్య అని వాటర్ గ్రిడ్లో నల్గొండ జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభలో అన్నారు. శాసన సభలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆయన సమాధానం ఇచ్చారు.
ముస్లీంలు, ఉర్దూ సమస్యల పైన సమావేశం ఏర్పాటు చేసి మజ్లిస్ శాసన సభ్యులను ఆహ్వానిస్తామని కేసీఆర్ తెలిపారు. ఉర్దూ పాఠశాలల్లో ఖాళీల వివరాలను సేకరించి భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ఉర్దూ మీడియంలో చదివేవారికి ఉత్తీర్ణత మార్కులు తగ్గిస్తామన్నారు.
ప్రభుత్వ భూముల్లో ఉన్న ముస్లీంల నివాసాలను క్రమబద్దీకరిస్తామని చెప్పారు. మురికివాడల్లో ఉన్న వారి విద్యుత్ బకాయిల పైన చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆసరా పథకంలో ఒక్క అర్హుడికి కూడా అన్యాయం చేయబోమని చెప్పారు. ప్రతి మండలానికి ఒక 108ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితిపై డిసెంబరులో శ్వేతపత్రం విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పారు.
కాగా, తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ్టి శాసన సభ సమావేశంలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో పాఠశాల విద్య పైన అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య కాసేపు వాడివేడిగా చర్చ జరిగింది. అనంతరం బడ్జెట్ పైన చర్చ జరిగింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ పైన చర్చకు సమాధానం ఇచ్చారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications