జగన్! అప్పుడు తప్పనిపించలేదా: అఖిల, వైసిపిని దెబ్బతీసేందుకు బాబు ప్లాన్ ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: తన తల్లి శోభా నాగిరెడ్డి మృతి చెందినప్పుడు తాను రెండు రోజులకే ప్రచారం చేశానని మంత్రి అఖిలప్రియ గురువారం చెప్పారు. ఆమె నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసిపిని నిలబెట్టేందుకు తన తల్లిదండ్రులు కృషి చేశారన్నారు. జగన్ పార్టీలో ఉన్నప్పుడు మంచిగా, బయటకు వచ్చాక చెడ్డగా కనిపించడం విడ్డూరమన్నారు.

జగన్ కోసం.. తీగ లాగితే: బాబుకు అడ్డంగా దొరికిన ప్రశాంత్ కిషోర్

జగన్‌కు సూటి ప్రశ్న

జగన్‌కు సూటి ప్రశ్న

ఈ సందర్భంగా జగన్‌కు సూటి ప్రశ్న సంధించారు. తాను తన తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయిన రెండు రోజులకే సభకు రావడాన్ని వైసిపి నేతలు, జగన్ తప్పుబట్టటాన్ని ఆమె ప్రశ్నించారు.

అప్పుడు నేను వైసిపిలో ఉన్నాననా

అప్పుడు నేను వైసిపిలో ఉన్నాననా

తన తల్లి శోభా నాగిరెడ్డి 2014లో చనిపోయినప్పుడు రెండు రోజులకే ప్రచారం చేశానని అఖిలప్రియ గుర్తు చేశారు. అప్పుడు తాను వైసిపిలో ఉన్నాను కాబట్టి తప్పుగా అనిపించలేదా అని ప్రశ్నించారు. తన తండ్రి గారి ఆశయ సాధన కోసం తాను అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు తప్పపట్టడం విడ్డూరమన్నారు.

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
నాడు స్వల్ప మెజార్టీతో గెలిచిన భూమా నాగిరెడ్డి

నాడు స్వల్ప మెజార్టీతో గెలిచిన భూమా నాగిరెడ్డి

కాగా, నంద్యాల నియోజకవర్గంలో నంద్యాలతోపాటు నంద్యాల, గోస్పాడు గ్రామీణ మండలాలు ఉన్నాయి. మొత్తం 2,30,811 ఓట్లు ఉన్నాయి. నాడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డికి 78,590 ఓట్లు వచ్చాయి. వైసిపి తరఫున పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి 82,194 ఓట్లు వచ్చాయి. స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.

మనకు ఎక్కడ ఓట్లు పడతాయి... వైసిపి-టిడిపి విశ్లేషణ

మనకు ఎక్కడ ఓట్లు పడతాయి... వైసిపి-టిడిపి విశ్లేషణ

ఈ మెజార్టీ స్వల్పంగా ఉండటంతో తాజా ఎన్నికల్లో అధికార పార్టీ టిడిపి, వైసిపి గత ఎన్నికల్లో ఏయే గ్రామాలు, పట్టణాల్లో ఏయే ప్రాంతాల్లో మెజార్టీ వచ్చిందో విశ్లేషిస్తోంది. మరోవైపు ఇరుపార్టీలకు ఏకపక్షంగా ఓట్లు పడే గ్రామాల వైపు రెండు పార్టీల నాయకులు ఇప్పుడు దృష్టి సారించారు.

ఓట్ల కోసం టిడిపి పాట్లు

ఓట్ల కోసం టిడిపి పాట్లు

నంద్యాల పట్టణంలో పలు ప్రాంతాలు, సామాజిక వర్గాలపై టిడిపి దృష్టి సారించింది. అందుకే పోలింగ్‌ కేంద్రాల వారీగా కార్యకర్తలను కేటాయించి ఏ కుటుంబం ఎటువైపు మొగ్గు చూపుతుందో సర్వే చేయించారు. ఆ ప్రాంతాల సామాజిక సమస్యలు, వర్గాల వారీగా అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టి పెట్టారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో టిడిపి, వైసిపికి చెందిన గత ఓట్లను తిరిగి దక్కించుకోవడంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులపై టిడిపి కన్ను

వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులపై టిడిపి కన్ను

ఇప్పటికే వైసిపిలో ఆయా వార్డుల్లో, గ్రామాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న ద్వితీయ శ్రేణి నాయకులను టిడిపికి మద్దతునిచ్చేలా కూడకట్టినట్లుగా తెలుస్తోంది. గ్రామాల విషయానికి వస్తే.. వైసిపి, టిడిపిలకు ఏకపక్షంగా ఓట్లు పోలయ్యే అవకాశముంది. వీటిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు స్థానిక నేతలకు సూచించారని సమాచారం.

గోస్పాడులో వైసిపి మద్దతుదారుపై టిడిపి కన్ను

గోస్పాడులో వైసిపి మద్దతుదారుపై టిడిపి కన్ను

గోస్పాడు మండలంలోని దీబగుంట్ల మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీపీ నాగిరెడ్డి స్వగ్రామం. ప్రస్తుతం ఆయన వైసిపికి మద్దతు ఇస్తున్నారు. ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుందో టిడిపి ఇప్పటికే ఆరా తీసిందని తెలుస్తోంది. గోస్పాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలపై టిడిపి దృష్టి పెట్టింది.

గంగుల ప్రభాకర్ రెడ్డి బంధువర్గంపై కన్ను

గంగుల ప్రభాకర్ రెడ్డి బంధువర్గంపై కన్ను

భీమవరంలో ఆధిపత్యం కోసం టిడిపి పావులు కదుపుతోంది. ఇక్కడ వైసిపి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి బంధువర్గం ఉండటంతో టిడిపి ఇక్కడ దృష్టి సారించింది. శిల్పా సోదరులకు పట్టున్న గ్రామాల్లోను పైచేయి కావాలని టిడిపి భావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister and Telugu Desam Party leader Akhila Priya questioned YSR Congress Party leader YS Jaganmohan Reddy on over Nandyal campaign
Please Wait while comments are loading...