"2034 వరకు విజయే సీఎం.. ఇదిగో ప్రూఫ్.."

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. పార్టీ పెట్టిన కేవలం రెండు నెలల్లోనే విజయ్ టీవీకే పార్టీ.. తమిళనాడులో రెండు కంచుకోటలుగా భావించే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్ని వెనక్కు నెట్టి అధికారాన్ని కైవసం చేసుకుంది. అలా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఓ ప్రభంజనం సృష్టించారు విజయ్. అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహనీయులు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ పెట్టి సీఎం అయ్యారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత వారి స్థానంలో విజయ్ చేరడం విశేషం.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎం హోదాలో విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మద్యపాన నిషేధం, రైతులకు రుణమాఫీ, డ్రగ్స్ నిర్మూలన తదితర కీలక నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ జ్యోతిష్కుడు షెల్వీ.. తమిళనాడు రాజకీయాల భవిష్యత్తు, టీవీకే పార్టీ అధినేత విజయ్ రాజకీయ భవితవ్యంపై ఆసక్తికరమైన అంచనాలను వెల్లడించారు. విజయ్ జాతకంలో బలమైన నీచభంగ రాజయోగం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయ్ పార్టీ ఊహించని విధంగా 108 స్థానాలను గెలుచుకోవడం ఒక పెద్ద విజయం అని తెలిపారు.

Vijay to Remain Tamil Nadu CM Until 2034 Prominent Astrologer Shelvi Viral Prediction Creates Buzz

విజయ్ పరిపాలన సాగించేటప్పుడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత లాగా కఠినమైన నాయకుడిగా ఎదుగుతారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, మహిళల రక్షణ తదితర అంశాల్లో అసలు రాజీపడరని.. అవసరమైతే ఎన్ కౌంటర్ లాంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారని తెలిపారు. విజయ్ జాతకంలో 2034 వరకు శుక్ర దశ, సూర్య దశ బలంగా ఉన్న కారణంగా అప్పటివరకు తమిళ రాజకీయాల్లో ఓ తిరుగులేని శక్తిగా కొనసాగుతారని అంచనా వేశారు. అయితే ఏళ్లనాటి శని ప్రభావం వల్ల విజయ్ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని.. పార్టీలోని వారి వల్లే కొన్ని ఇబ్బందులు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలు విజయ్, అన్నామలై, ఉదయనిధి స్టాలిన్ వీళ్ల చుట్టూనే తిరుగుతుందని అంచనా వేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+