అఖిల్ బాధ్యతను స్వీకరించిన రామ్ చరణ్

ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ బాగా డిస్టర్బ్ అయ్యారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బయట కనపడలేదు. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ కావడం ఒక కారణం కాగా.. అక్కినేని అభిమానుల్లో నిరాశ రెట్టింపు కావడం మరో బాధ. ఏడు సంవత్సరాల క్రితం కెరీర్ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా పడలేదన్న ఆక్రోశం అఖిల్ లో ఉంది.

అయితే తాజాగా అఖిల్ బాధ్యతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకోబుతున్నాడు. తన స్నేహితుడైన విక్రమ్ తో కలిసి యువీ మెగా బ్యానర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా అఖిల్ తో తీయబోతున్నారు. అఖిల్ మీద రామ్ చరణ్ కు ప్రేమ ఎక్కువ. మొదటి నుంచి వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఏజంట్ సినిమా ప్రమోషన్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఒక వీడియో బిట్ లో ధ్రువ గెటప్ లో నటించారు. గతంలో ఏ సినిమాకు రామ్ చరణ్ ఇలా చేయలేదు. అలాగే పలు ఇంటర్వ్యూల్లో కూడా అఖిల్ మెగా పవర్ స్టార్ నుంచి తాను ఎటువంటి గైడెన్స్ తీసుకుంటానో వివరించాడు. అయితే ఈసారి కథ ఎంపిక చేయడందగ్గర నుంచి దర్శకుణ్ని ఎంపిక చేయడం, ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకోవడంతోపాటు మొత్తం అన్ని వ్యవహారాలు రామ్ చరణ్ తీసుకోబోతున్నాడు. అఖిల్ కేవలం సినిమాలో నటించడవరకే అతని బాధ్యత. చరణ్ పర్య పర్యవేక్షణలో విక్రమ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుని సినిమాను సెట్ చేయబోతోంది.

ramcharanakhilakkineni

ఎలా అయినా అఖిల్ కు ఒక బ్రేక్ దక్కితే చాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. యువీ క్రియేషన్స్ లో పలు సినిమాలకు పనిచేసిన అనిల్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే సాధ్యమైనంత త్వరగా అఖిల్ సినిమాను పట్టాలెక్కించాలని రామ్ చరణ్ భావిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య సినిమా కస్టడీ పరాజయం పాలైంది. నాగార్జున ప్రాజెక్టు వాయిదాలు పడుతూ వస్తోంది. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. నాగచైతన్య రెండు ప్రాజెక్టులు చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+