అక్కినేని నాస్తికుడు: భక్తుల పాత్రల్లో అలరించాడు
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు సినిమాలు తెగచూసినవారు కూడా ఆయన నాస్తికుడంటే నమ్మకపోవచ్చు. ఆయన భక్తుల పాత్రలను పోషించి, అలరించిన తీరు చూస్తే ఆయనకు దేవుడిపై నమ్మకం లేదంటే ఎవరూ నమ్మరు. కానీ, అది నిజం. ఆయన పలుమార్లు ఈ విషయాన్ని సభల్లో చెప్పారు. ఆయన అఆలు అనే పుస్తకం కూడా రాశారు. ఆయన జీవితానికి సంబంధించి కొన్ని సూత్రాలు రూపొందించి వాటి ప్రకారం నడుచుకున్నారు.
మానవుడిపై ఆయన ఎక్కువ మక్కువ. అయినా ఆయన తెలుగు సినిమాల్లో భక్తాగ్రేసరుల పాత్రలను అమోఘంగా పోషించి మెప్పించారు. అక్కినేని తప్ప మరొకరు ఆ పాత్రలు అంతకన్నా గొప్పగా చేయలేరని అనిపించారు. మహాకవి కాళిదాసు, భక్త జయదేవ, మహాకవి క్షేత్రయ్య సినిమాల్లో ఆయన లీనమై నటించారు.

కాళిదాసు, క్షేత్రయ్య అచ్చం ఇలాగే ఉండేవారు అనిపించేలా నటించారు. భక్త తుకారాం, భక్త రామదాసు చిత్రాల గురించి చెప్పాల్సిన పని లేదు. విప్ర నారాయణ పాత్రకు కూడా ఆయనకు ఎనలేని పేరు వచ్చింది. జయభేరి, తెనాలి రామకృష్ణ వంటి సినిమాల్లో కూడా ఆయన అలరించారు.
ఓవైపు ఎన్టీ రామారావు పౌరాణిక పాత్రల్లో తన సత్తాను చాటుతుంటే భక్తుల పాత్రలను పోషించి అక్కినేని అలరించారు. మహాకవుల పాత్రలను ఆయన పోషించారు. దైవకృప కారణంగా మహా కవులైన కాళిదాసు, భక్త రామదాసు పాత్రలను ఆయన అమోఘంగా పోషించారు.
-
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!!












Click it and Unblock the Notifications