భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. శ్రీశైల ఆలయంలో విభూదిధారణ పునః ప్రారంభం..

శ్రీశైలం ఆల‌యానికి వెళ్లే భ‌క్తుల‌కు అధికారులు ఓ శుభ‌వార్త‌ను అందించారు. తిరుమ‌ల త‌ర‌హాలో ఇక్క‌డ కూడా విభూదిధారణ కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. కరోనా స‌మ‌యంలో శ్రీ‌శైల మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌యంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసారు. అనంత‌రం తిరిగి నిన్న (సోమవారం) ఆలయంలో ఆలయ ఈవో పెద్దిరాజు స‌మ‌క్షంలో విభూదిధారణ కార్యక్రమానికి తిరిగి ప్రారంభించారు. సుమారు నాలుగేళ్ల తర్వాత విభూదిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. శ్రీశైలం మల్లన్న ఆలయ సంస్కృతీ సంప్రదాయాలపై భక్తులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించామని ఆల‌య అధికారులు తెలిపారు. భక్తులకు విభూదిధారణ చేసేందుకు శివసేవకుల సహకారాన్ని తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

శ్రీశైలం మల్లిఖార్జున‌స్వామి ఆల‌యంలో విభూదిని పెట్టుకోవ‌డమ‌నేది భక్తులు పరమ పవిత్రంగా భావిస్తుంటారని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలంలో గోమయంతో స్థానిక గోశాలలో నిష్టగా విభూదిని తయారు చేస్తారని అధికారులు అంటున్నారు. విభూది తయారీలో ఆల‌య‌ సిబ్బంది శాస్త్రోక్తంగా, ప్రమాణాలు పాటిస్తుంటారు. ఈ విభూదిని పెట్టుకోవ‌డం ద్వారా సంపద ప్ర‌సాదించ‌డంతో పాటు పవిత్రతను కలిగిస్తుందని ఇక్క‌డికొచ్చే భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. అంతటి పవిత్రత కలిగిన విభూదిని శ్రీశైల దేవస్థానం తయారు చేస్తుంద‌ని, దీనిని ఎంతో ప‌విత్ర‌త‌గా భ‌క్తులు కొలుస్తారు. ఏదిఏమైనా నాలుగుసంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మం తిరిగి ప్రారంభ‌మ‌వ్వ‌డం భ‌క్తులకు ఎంతో సంతోషాన్ని క‌లిగిస్తుంది.

Alert to devotees Vibhudidharana restarted in Srisaila temple

తిరుమ‌ల‌లో తిల‌క ధార‌ణ‌..

స్వామివారి ద‌ర్శ‌నం కోసం విచ్చేసే భ‌క్తులు క్యూలైన్ల దగ్గర విభూతిధారణ ధరించి మాత్ర‌మే స్వామి అమ్మవార్ల ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని ఆల‌య ఈవో సూచించారు. నుదుటన బొట్టు పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయమ‌ని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ప్రవేశం చేసే భ‌క్తులంతా తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించి, ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాల‌ని వివ‌రించారు. తిరుమలలో కూడా భ‌క్తుల‌కు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబ‌ర్ 6వ తేదిన టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, విక్యూసి 1, 2ల దగ్గర స్వామివారి సేవకులు నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+