టిడిపి టిక్కెట్‌పై అలీ, సుమన్: కృష్ణ సోదరుడు కూడా?
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు అలీ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పైన పోటీ చేయనున్నారా? అంటే కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెడతారనే వార్తల నేపథ్యంలో... తాను రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఆలోచిస్తానని అలీ చెప్పారు. అయితే, తాజాగా టిడిపి నుండి పోటీ చేసే అవకాశాలున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోను అలీ టిడిపి నుండి రాజమండ్రిలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.
అలీ టిడిపి టిక్కెట్ పైన గుంటూరు 1 నుండి పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు. మరోవైపు ప్రముఖ నటుడు సుమన్ కూడా రేపల్లె నుండి పోటీ చేయవచ్చునని వినికిడి. అలీ టిడిపి సానుభూతిపరుడు. ఆయన గతంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుంటూరు-1 సీటుకు ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనారిటీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఆ సీటుకు ఆ వర్గాల నుంచి ఎవరినైనా నిలపాలని టిడిపి భావిస్తోంది.
దివంగత టిడిపి నేత లాల్‌జాన్ బాషా సోదరుడు గతంలో ఆ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. కానీ, ఇప్పుడు ఆయన కంటే మెరుగైన అభ్యర్థి కోసం టిడిపి అన్వేషిస్తోంది. ఈ విషయమై అలీతో చర్చలు జరుగుతున్నాయట. గుంటూరు-2 సీటుకు టిడిపి తరఫున తాజాగా నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు పేరు ప్రచారంలోకి వచ్చింది. గతంలో ఆయనకు తెనాలి అసెంబ్లీ అనుకొన్నారు. కానీ, రాజేంద్ర ప్రసాద్‌కు ఈసారి కూడా ఆ సీటు ఇవ్వాలని నిర్ణయించారు.
దీనితో ప్రత్యమ్నాయంగా గుంటూరు-2 సీటును శేషగిరి రావుకు ఇచ్చే అవకాశముందంటున్నారు. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గుంటూరు-2 సీటుకు నటి కవిత పేరు కూడా పరిశీలనలో ఉందట. అదే జిల్లాలో రేపల్లె సీటుకు సినీ హీరో సుమన్ పేరు కూడా టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.
కాగా, ఒంగోలు ఎంపీ సీటుకు తాజాగా మోదుగుల వేణుగోపాల రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన ప్రస్తుతం నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి అదే స్థానంలో ఆయన సొంత బావ అయోధ్యరామి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీలో చేస్తున్నారు. దీంతో బావ పైన పోటీ చేయడం ఇష్టం లేని మోదుగుల సీటు మారుతున్నట్లుగా తెలుస్తోంది.

అలీ
ప్రముఖ టాలీవుడ్ హాస్య
నటుడు అలీ తెలుగుదేశం
పార్టీ టిక్కెట్ పైన పోటీ
చేయనున్నారా? అంటే
కావొచ్చుననే వార్తలు
వస్తున్నాయి. గుంటూరు-1
సీటుకు ఆయన పేరును
పరిశీలిస్తున్నట్లు
ప్రచారం జరుగుతోంది.

సుమన్
గుంటూరు-2 సీటుకు నటి కవిత
పేరు కూడా పరిశీలనలో ఉందట.
అదే జిల్లాలో రేపల్లె
సీటుకు సినీ హీరో సుమన్
పేరు కూడా టిడిపి
వర్గాల్లో ప్రచారంలో ఉంది.

కవిత
గుంటూరు జిల్లాలో రేపల్లె
సీటుకు సినీ హీరో సుమన్
పేరు కూడా టిడిపి
వర్గాల్లో ప్రచారంలో ఉంది.
గుంటూరు-2 సీటుకు నటి కవిత
పేరు కూడా పరిశీలనలో ఉందట.

మోదుగుల
ఒంగోలు ఎంపీ సీటుకు తాజాగా
మోదుగుల వేణుగోపాల రెడ్డి
పేరు ప్రచారంలోకి
వచ్చింది. ఆయన ప్రస్తుతం
నర్సరావుపేట లోక్‌సభ
స్థానానికి ప్రాతినిధ్యం
వహిస్తున్నారు. ఈసారి అదే
స్థానంలో ఆయన సొంత బావ
అయోధ్యరామి రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ తరఫున పోటీలో
చేస్తున్నారు.












Click it and Unblock the Notifications