వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అంటారా: పవన్ కళ్యాణ్‌పై ఐఏఎస్‌ల ఆగ్రహం, ముప్పేట దాడి

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. టిటిడి ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ఇప్పటికే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చ

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. టిటిడి ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ఇప్పటికే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోహన్ బాబు కూడా తప్పుబట్టారు.

<strong>తెలుసుకో: బీజేపీ, పవన్ కళ్యాణ్ 'ఉత్తరాది'పై మోహన్ బాబు గట్టి ఝలక్ </strong>తెలుసుకో: బీజేపీ, పవన్ కళ్యాణ్ 'ఉత్తరాది'పై మోహన్ బాబు గట్టి ఝలక్

తాజాగా, ఐఏఎస్ సంఘంల సంఘం కూడా ఖండించింది. అంతకుముందు కొందరు ఏపీ అధికారులు మాత్రం ఉత్తరాది వారిని నియమించడంపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడాన్ని ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే, ఎక్కువ మంది మాత్రం ఇలా ఉత్తరాది, దక్షిణాది అని విడదీయడాన్ని తప్పుబడుతున్నారు.

ఐఏఎస్‌ల సంఘం ఖండన

ఐఏఎస్‌ల సంఘం ఖండన

ఐఏఎస్ సంఘం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ట్విట్టర్‌లోనే ఖండించింది. ఈ ఖండన ద్వారా రెండు అంశాలు అర్థమవుతున్నాయి. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని, తమకు దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమర, ఈశాన్యం అనే తేడాలు ఉండవని అంటున్నారు. సింఘాల్ ఎక్కడైనా పని చేసేందుకు అర్హుడే అంటున్నారు. ఆ ఉద్దేశ్యంతో ఓ ట్వీట్ చేశారు.

దక్షిణాది పుణ్యక్షేత్రం కాదు..

దక్షిణాది పుణ్యక్షేత్రం కాదు..

మరో ట్వీట్ కూడా అసలు తిరుమల తిరుపది దేవస్థానంను కేవలం దక్షిణాది పుణ్యక్షేత్రంగా చెప్పడం సరికాదని, భారతీయులందరూ శ్రీ వెంకటేశ్వరుడిని విశ్వసిస్తారని అందుకే కృత్రిమంగా గోడలను నిర్మించవద్దని మరో ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఏపీలో ఉన్నంత మాత్రాన వెంకటేశ్వరుడిపై దక్షిణాది ముద్ర సరికాదంటున్నారు.

అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్య

అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్య

పవన్ కళ్యాణ్ టిటిడి ఈవో నియామకంపై చేసిన వ్యాఖ్యను ఇప్పటికే బీజేపీ, టిడిపిలు తీవ్రంగా ఖండించాయి. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అయితే పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు. అంటే ఆయనకు తెలియదని కాదు. కానీ పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన అలా స్పందించారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కు వరుస షాక్‌లు..

పవన్ కళ్యాణ్‌కు వరుస షాక్‌లు..

నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. శ్రీ వెంకటేశ్వరుడిని ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు.

English summary
Many political leaders and IAS officers are condemned Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X