మమ్మల్నే టార్గెట్ చేశారు: సభలో విజయమ్మ ఆవేదన

హైదరాబాద్: తమ పార్టీ ఎప్పుడూ విభజనకు వ్యతిరేకమని, రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటోందని అయినప్పటికీ అందరూ తమను టార్గెట్ చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం అన్నారు. ఉదయం వాయిదా పడిన సభ తిరిగి పదకొండు గంటలకు ప్రారంభమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో విజయమ్మకు మాట్లాడేందుకు సభాపతి నాదెండ్ల మనోహర్ అనుమతించారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. తాము చర్చకు వ్యతిరేకం కాదన్నారు. చర్చను అడ్డుకోవాలనేది తమ ఉద్దేశ్యం కాదన్నారు. అయితే, తీర్మానం లేదా ఓటింగ్ పెట్టిన తర్వాత చర్చకు తాము అంగీకరిస్తామన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎందుకులేరన్నారు. బిల్లు రావడం దురదృష్టకరమన్నారు. ఆర్టికల్ 3ను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు.

 YS Vijayamma

బిల్లు పైన తమ అభ్యంతరాలు చెబుతున్నామన్నారు. తాము విభజనకు వ్యతిరేకంగానే చర్చ వద్దంటున్నామని అయినా తమనే అందరు టార్గెట్ చేస్తున్నారన్నారు. చర్చలో పాల్గొనకుంటే విభజనకు అనుకూలగమని చెప్పడమేమిటన్నారు. సమైక్యం కోసం చివరిదాకా పోరాడుతామన్నారు. తాము బిల్లు పైన చ్రిచంచడంలేదన్నారు. సమైక్యం కోసం అర్థిస్తున్నానన్నారు. కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. బెంగాల్ విభజన సమయంలో అసెంబ్లీ తీర్మానం జరిగిందని, చర్చకు ముందు ఓటింగ్ పెట్టాలన్నారు.

సహకరించండి: ఆనం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిల్లు పైన చర్చకు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. చర్చలో పాల్గొన్న తర్వాత తీర్మానం, ఓటింగ్ ఉంటుందన్నారు. రాష్ట్రపతి బిల్లు పైన అభిప్రాయాలు అడిగారని చెప్పారు. చర్చ లేకుండా తీర్మానానికి వెళ్తే అభిప్రాయం చెప్పే వీలుండదన్నారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరగాలని, రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. మన అభిప్రాయం చెప్పాల్సి ఉందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చర్చకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. బిల్లు పెట్టే సమయంలో చంద్రబాబు లేరని విజయమ్మ అనడం సరికాదని ఆయన అన్నారు. ఈ సమయంలో సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆందోళన చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి సభను వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+